సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ మహానగ రంలో రాజకీయ నేతలు, ప్రముఖులు వినియోగిం చే వాహనాల సైరన్, సౌండ్ హారన్ల వినియోగంపై ఆంక్షలు ఏవిధంగా ఉన్నాయో తెలియజేయాలని తెలంగాణ ప్రభు త్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందిన మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయో, బుగ్గ కార్ల వినియోగ నిబం ధనలు ఏం చెబుతున్నాయో కూడా తమకు వివ రించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సౌండ్ హారన్లు వినియోగించరాదని, ఎర్ర బుగ్గ కార్లను ఎవరు పడితే వారు వినియోగించకుండా ఉత్తర్వులు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారిం చింది. నగరానికి చెందిన న్యాయవాది వినీత్ దన్దా దాఖలు చేసిన పిల్ విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కుమార్ కల్పించుకుని వివరాలు సేకరించి తెలియజేసేందుకు సమయం కావాలని కోరగా, ధర్మాసనం పైవిధంగా స్పందించింది. విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment