Russia-Ukraine conflict: Anand Mahindra Commenting On Ukraine Russia War - Sakshi
Sakshi News home page

Anand Mahindra: గత యుద్ధాల నుంచి మనం ఏం నేర్చుకున్నాం?

Published Thu, Feb 24 2022 2:53 PM | Last Updated on Thu, Feb 24 2022 3:28 PM

Anand Mahindra Commenting On Ukraine Russia War - Sakshi

Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దండయాత్రపై ప్రముఖ ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా స్పందించారు. యుద్ధంతో ముడిపడిన తన చిన్ననాటి జ్ఞాపకాలను తలచుకుని కలత చెందారు. గత యుద్ధాలు మనకు నేర్పిన పాఠాలు ఏంటీ? ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటూ సూటిగా ప్రశ్నించారు.

రష్యా క్షిపణి దాడులకు పాల్పడుతుండటంతో ఉక్రెయిన్‌ ప్రభుత్వం తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ముఖ్యంగా బాంబు దాడి జరిగే అవకావం ఉన్న సందర్భంలో ముందస్తుగా ఎయిర్‌ రైడ్‌ సైరెన్‌ మోగిస్తోంది. ఈ శబ్ధం విన్న ప్రజలు వెంటనే అప్రమత్తమై బంకర్లలో తల దాచుకుంటున్నారు. రష్యాలోని లివవ్‌ పట్టణంలో సైరన్‌ మోగుతున్న వీడియోను ఆనంద్‌ మహీంద్రా రీట్వీట్‌ చేశారు.

నా చిన్నతనంలో ముంబై ఉన్నారు. 1965, 1971లో రెండు సార్లు యుద్ధాలు జరిగాయి. ఆ సమయంలో ముంబైపై దాడి జరిగే అవకాశం ఉందంటూ సైరన్లు మోగించారు. అప్పుడు మేమంతా బిక్కచచ్చిపోయి.. బిక్కుబిక్కుమంటూ గడిపాం. ఇప్పటికీ ఆ సైరన్‌ వింటే నాకు వెన్నులో వణుకు పుడుతుంది. యుద్ధం తెచ్చే చేటు గురించి తెలిసి కూడా ఇలాంటి చర్యలకు ఎందుకు పాల్పడుతారో ? ఇవన్నీ చూస్తుంటే గత యుద్ధాల నుంచి మనమేమీ నేర్చుకోలేదు అన్నట్టుగా ఉంది అంటూ కామెంట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement