Air raid
-
యుద్ధం.. ఆ శబ్ధం వింటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది- ఆనంద్ మహీంద్రా
Russia-Ukraine war: ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన దండయాత్రపై ప్రముఖ ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా స్పందించారు. యుద్ధంతో ముడిపడిన తన చిన్ననాటి జ్ఞాపకాలను తలచుకుని కలత చెందారు. గత యుద్ధాలు మనకు నేర్పిన పాఠాలు ఏంటీ? ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటూ సూటిగా ప్రశ్నించారు. రష్యా క్షిపణి దాడులకు పాల్పడుతుండటంతో ఉక్రెయిన్ ప్రభుత్వం తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ముఖ్యంగా బాంబు దాడి జరిగే అవకావం ఉన్న సందర్భంలో ముందస్తుగా ఎయిర్ రైడ్ సైరెన్ మోగిస్తోంది. ఈ శబ్ధం విన్న ప్రజలు వెంటనే అప్రమత్తమై బంకర్లలో తల దాచుకుంటున్నారు. రష్యాలోని లివవ్ పట్టణంలో సైరన్ మోగుతున్న వీడియోను ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. I have lived through two wars during my childhood: ‘65 & ‘71. And I remember how spine chilling it was when air raid sirens went off in Mumbai. This sound has reawakened those nightmarish memories. The world doesn’t seem to have learned any lessons… https://t.co/rVxTGy2J80 — anand mahindra (@anandmahindra) February 24, 2022 నా చిన్నతనంలో ముంబై ఉన్నారు. 1965, 1971లో రెండు సార్లు యుద్ధాలు జరిగాయి. ఆ సమయంలో ముంబైపై దాడి జరిగే అవకాశం ఉందంటూ సైరన్లు మోగించారు. అప్పుడు మేమంతా బిక్కచచ్చిపోయి.. బిక్కుబిక్కుమంటూ గడిపాం. ఇప్పటికీ ఆ సైరన్ వింటే నాకు వెన్నులో వణుకు పుడుతుంది. యుద్ధం తెచ్చే చేటు గురించి తెలిసి కూడా ఇలాంటి చర్యలకు ఎందుకు పాల్పడుతారో ? ఇవన్నీ చూస్తుంటే గత యుద్ధాల నుంచి మనమేమీ నేర్చుకోలేదు అన్నట్టుగా ఉంది అంటూ కామెంట్ చేశారు ఆనంద్ మహీంద్రా. -
వైమానిక దాడులు.. 31మంది మృతి
సనా: ఉగ్రవాదులను అణిచి వేసే క్రమంలో సౌదీ అరేబియా సమక్షంలో ఆదివారం జరిగిన వైమానిక దాడుల్లో 31మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 17మంది అమాయక పౌరులు ఉండగా.. మిగితా 14మంది షితే హుతికి చెందిన ఉగ్రవాదులు. సౌదీ అరేబియాలోని హజ్జా వద్ద గల వాటర్ బాటిల్ కర్మాగారంలో తిరుగుబాటుదారులు తలదాచుకుని ఉన్నారన్న సమాచారం మేరకు సౌదీ సైన్యం దానిపై వైమానిక దాడులు జరిపింది. ఒక్క ఆదివారమే ఈ ఫ్యాక్టరీ కాకుండా మొత్తం పన్నెండు చోట్ల వైమానిక దాడులు నిర్వహించింది. దీంతో ఒక్క వాటర్ బాటీల్ కర్మాగారం వద్దే 31 మంది ప్రాణాలు కోల్పోయారు. గత నెలలో కూడా సౌదీ సైన్యం ఉగ్రవాదుల కోసం నిర్వహించిన దాడుల్లో 65 మంది అమాయక ప్రజలు మృతిచెందారు. -
రక్తమోడిన దౌమా
- సిరియా వైమానిక దాడుల్లో చిన్నారులు సహా 82 మంది హతం దమస్కస్: సిరియా రాజధాని దమస్కస్ కు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న దౌమా పట్టణంలో నెత్తురు ఏరులైపారింది. తిరుగుబాటుదారులను అణిచివేసే క్రమంలో సిరియా ప్రభుత్వం ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో పెద్ద సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలుకోల్పోయారు. చిన్నారులు సహా 82 మంది హతమయ్యారు. మరో 200 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం తిరుగుబాటుదారుల ఆధీనంలోఉన్న దౌమా పట్టణాన్ని తిరిగి సొంతం చేసుకోవాలనుకున్న ప్రభుత్వం గడిచిన కొద్దిరోజులుగా దాడులు జురుపుతూనేఉన్నది. ఆ క్రమంలోనే ఆదివారంనాడు అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో వైమానిక దాడులు జరిపింది. అత్యాధునిక యుద్ధవిమానాలు, హెలికాప్టర్లతో బాంబులు కురిపించింది. ఒక్కసారిగా కురిసిన బాంబుల వర్షంతో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలతో ఆ ప్రాంతమంతా బహిరంగ స్మశానంలా మారింది. దాడుల్లో గాయపడిని వారిని గుర్తించి, చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తిరుగుబాటు దళాల నేతృత్వంలోని సహాయ బృందాలు వెల్లడించాయి. గడిచిన నాలుగేళ్లుగా సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధంలో ఇప్పటివరకు రెండు లక్షల పైచిలుకు మంది మరణించగా, తొమ్మిది లక్షల మంది గల్లంతయ్యారు.