![Actor Hari Vairavan of Vennila Kabadi Kuzhu fame Dies - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/4/actor.jpg.webp?itok=gwmZytLe)
నటుడు హరి వైరవన్
నటుడు హరి వైరవన్ (38) శుక్రవారం అర్ధరాత్రి మదురైలో కన్నుమూశారు. సుశీంద్రన్ దర్శకత్వం వహించిన వెన్నెలా కబడ్డీ కుళు చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. అందులో విష్ణు విశాల్ మిత్రుల్లో ఒకరిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత వెన్నెలా కబడ్డీ కుళు–2, కుళ్లు నరి కూట్టం తదితరులు చిత్రాల్లో నటించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అనారోగ్యానికి గురి కావడంతో వైద్య పరీక్షలో కిడ్నీ పాడైపోయిందని తెలియడంతో మదురైలో వైద్య చికిత్స పొందుతూ వచ్చారు. అయితే వైద్యం ఫలించక తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి నటుడు విష్ణు విశాల్, బ్లాక్ పాండి, అంబానీ శంకర్, దర్శకుడు బాలాజీ తదితర సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. హరి వైరవన్‌కు భార్య కవిత, కూతురు రెండేళ్ల రోషిణీశ్రీ ఉన్నారు.
ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు స్వగ్రామంలో జరిగాయి. కాగా నటుడు హరి వైరవన్ కుటుంబం ఇప్పటి వరకూ ఆయన సంపాదనతోనే గడుస్తూ వచ్చింది. హరి వైరవన్ మరణంతో ఆ కుటుంబం జీవనాధారం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో చిత్ర పరిశ్రమ ఆర్థికంగా ఆదుకోవాలని హరి వైరవన్ భార్య మీడియా ద్వారా వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment