తమిళనాడు: పుట్టిన రోజు, న్యూఇయర్ వేడుకలను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం ఈరోజుల్లో చాలా కామన్. అయితే ఇదే అదనుగా కొంతమంది దందా రాయుళ్లు కల్తీ కేకులను తయారు చేయడం మొదలుపెట్టారు. కల్తీ కేకులు ఏంటి అనుకుంటున్నారా? అవును.. కుళ్లిపోయిన కోడిగుడ్లతో కేకులు తయారుచేస్తున్న ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో బయటపడింది. కుళ్లిన కోడిగుడ్లతో కేకులు తయారుచేస్తున్నారని మధురై అధికారులకు ఇటీవల ఫిర్యాదులు అందాయి.
దీంతో అధికారులు కొన్ని బేకరీలు, గోదాముల్లో తనిఖీలు చేపట్టారు. తత్తనేరిలోని ఓ గోదాములో కుళ్లిన కోడి గుడ్లను పెద్ద ఎత్తున స్టోర్ చేయడం గుర్తించారు. ఒక్కో గుడ్డును కేవలం రూ.1కే విక్రయిస్తుండటంతో పలువురు బేకరీ షాపుల యజమానులు వాటిని తీసుకెళ్లి కేకు తయారీలో వాడుతున్నారు. ఈ దందాను తీవ్రంగా పరిగణించిన పోలీసులు బాధ్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి కేకులు తింటే అనారోగ్యాలు కొనితెచ్చుకున్నట్టేనని వైద్యులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment