సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికలంటే అన్నిపార్టీ ల్లోని శ్రేణులకు ఆసక్తే. ఎన్నికల్లో పోటీచేయడం ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తహతహ పడడం, అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తికి లోనుకావడం సహజమే. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అ న్నిపార్టీల కంటే అన్నాడీఎంకేలో అసంతృప్తి, అసమ్మ తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. జయలలిత, కరుణానిధి కన్నుమూసిన తరువాత వచ్చిన తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో రెండుపార్టీలూ ప్రతిష్టాత్మకంగా పోరాడుతున్నాయి. ముఖ్యమంత్రి కావాలన్న జీవి త లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ అహర్నిశలూ పోరాడుతున్నారు. ఇక అన్నాడీఎంకే సైతం మూడోసారి గెలుపొందడం ద్వారా హ్యా ట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉంది. అదే జోరులో బుధవారం అభ్యర్థులను ప్రకటించిన వెంటనే ఆశావహులు అసంతృప్తితో రగలిపోవడం ప్రారంభమైంది. అలాగే సీట్లు ఖరారైన వారు కూడా అగ్రహంతో ఉన్నారు. తమను సంప్రదించకుండా మిత్రపక్ష పీఎంకేకు నియోజకవర్గాలను కూడా ఖరారు చేయడాన్ని అంగీకరించడం లేదు.
ఇలా అనేక నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఆగ్రహంతో ఊగిపోతూ గురువారం ఆందోళనకు దిగారు. కేటాయించిన నియోజకవర్గాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ పదిమంది అభ్యర్థుల అనుచరులు పలుప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. ముగ్గురు మంత్రులు సహా 41 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశం దక్కలేదు. సాత్తూరు నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మెల్యే రాజవర్మన్ మరో అడుగు ముందుకు వేసి ఎంఎంఎంకే ఆఫీసుకు వెళ్లి దినకరన్‌ను కలుసుకున్నారు. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం దినకరన్ వైపునకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సీటు దక్కని మంత్రి వలర్మతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 60 మంది కొత్తవారికి అవకాశం ఇవ్వగా వీరిలో కనీసం 53 మంది పాఠశాల విద్యను దాటనివారు కావడం గమనార్హం.
ఎంఎంఎంకే, డీఎండీకే చర్చలు..
అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన డీఎండీకే, ఎంఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌తో పొత్తు చర్చలు జరుపుతోంది. 50 నియోజకవర్గాలను కోరుతూ రహస్య చర్చలు కొనసాగిస్తోంది. తిరుచ్చిరాపల్లి జిల్లా జయంకొండం నుంచి సీటు దక్కకపోవడంతో వన్నియర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వైద్యలింగం పార్టీని వీడారు. ఆరు సీట్లతో సర్దుకున్న టీఎంసీ.. కూటమి నుంచి చివరిక్షణంలో బైటికి వచ్చేపరిస్థితులు కల్పించడంతో అన్నాడీంకేపై అసంతృప్తితో ఉన్న తమాకా అధ్యక్షులు జీకే వాసన్ టీఎంసీ ముఖ్య నిర్వాహకులతో గురువారం సమాలోచనలు జరిపారు. తాము కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు అన్నాడీఎంకే ముందుకు రావాలని గురవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా వాసన్ కోరారు. గురువారం సాయంత్రానికి ఇరుపార్టీల మధ్య సామరస్యం కుదరడంతో ఆరు సీట్లతో టీఎంసీ సర్దుకుంది.
డీఎంకేలో సైతం అసహనం..
డీఎంకేలో సైతం అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పొన్నేరి, పల్లడం, అవినాశి మిత్రపక్షాలకు కేటాయించడంతో రాస్తారోకో చేసాయిు. ఈరోడ్ జిల్లాలో సెంగుంద ముదలియార్ సామాజిక వర్గానికి ఏపార్టీలోనూ సీటు దక్కక పోవడంతో 500 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment