
సాక్షి, చెన్నై : డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌పై ఎండీఎంకే నేత వైగో ప్రశంసలు కురిపించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పోలుస్తూ కొనియాడారు. శుక్రవారం ఆయన స్టాలిన్ నియోజకవర్గమైన కొళత్తూరులో పర్యటించారు. వైగో మాట్లాడుతూ ఒబామా సెనేటర్‌గా ఉన్న సమయంలో తరచూ తాను ప్రాతినిథ్యం వహించే సెనేట్‌లో పర్యటించి ప్రజాసమస్యలు పరిష్కరించేవారన్నారు. అదే తరహాలో స్టాలిన్ సైతం ఎక్కడున్నా కొళత్తూరు ప్రజలతో మమేకమవుతుంటారని గుర్తుచేశారు. దీన్నిబట్టి ప్రజా సంక్షేమంపై వీరిద్దరి చిత్తశుద్ధి అర్థమవుతుందని వెల్లడించారు. అందుకే ఒబామా అమెరికా అధ్యక్షుడు అయ్యారని, ఇదే బాటలో స్టాలిన్ కూడా ముఖ్యమంత్రి కావడం తథ్యమని స్పష్టం చేశారు.
చదవండి: సర్వేలన్నీ ఆ పార్టీ వైపే : 161 నుంచి 169 స్థానాలు!
కమల్‌కు షాక్: రూ.11 కోట్లు సీజ్