లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.4 తగ్గిస్తాం | Tamil Nadu Assembly Polls 2021 DMK Releases Manifesto | Sakshi
Sakshi News home page

TN Assembly Polls: డీఎంకే మేనిఫెస్టో విడుదల

Published Sat, Mar 13 2021 1:29 PM | Last Updated on Sat, Mar 13 2021 3:08 PM

Tamil Nadu Assembly Polls 2021 DMK Releases Manifesto - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) శనివారం తమ మేనిఫెస్టో విడుదల చేసింది. సుమారు ఐదు వందలకు పైగా హామీలతో ప్రజల ముందుకు వచ్చింది. విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇచ్చినట్లు డీఎంకే అధినేత స్టాలిన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే, సామాన్యుడి నెత్తిన గుదిబండలా మారిన ఇంధన, వంటగ్యాస్‌ ధరలు తగ్గిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా కార్మికులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని వాగ్దానం చేశారు.

డీఎంకే మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

  • హిందూ ఆలయాల పునరుద్ధరణకు వెయ్యి కోట్లు
  • మసీదులు, చర్చిల పునరుద్ధరణకు రూ.200 కోట్లు
  • అన్నాడీఎంకే మంత్రుల అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టు
  • అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు
  • లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.4, పాలపై రూ.3 తగ్గిస్తాం
  • పెంచిన ఆస్తిపన్నును రద్దు చేస్తాం
  • వంటగ్యాస్‌పై సిలిండర్‌కు రూ.100 సబ్సిడీ
  • జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమిషన్
  • తమిళనాడులో నీట్ పరీక్షను రద్దు చేస్తాం
  • కోయంబత్తూరు సహాఇతర ప్రధాన పట్టణాల్లో మెట్రోరైలు ప్రాజెక్టులకు శ్రీకారం
  • ప్రముఖ యాత్రా స్థలాలకు వెళ్లాలనుకునే లక్ష మందికి రూ. 25 వేలు
  • శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇచ్చే దిశగా ప్రయత్నాలు
  • ప్రభుత్వ ఉద్యోగాల్లో 40శాతం మహిళలకు అవకాశం
  • ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాది పాటు మెటర్నటీ లీవులు
  • తమిళనాడు వ్యాప్తంగా కలైంజ్ఙర్ క్యాంటీన్లు ఏర్పాటు
  • కరోనాతో నష్టపోయిన బియ్యం కార్డుదారులకు రూ.4వేల సాయం

చదవండి: TN Assembly polls : స్టార్‌ హీరో అరంగేట్రం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement