
సాక్షి, చెన్నై: ఎండీఎంకే నేత వైగో 55 హామీలతో ప్రత్యేక మేనిఫెస్టోను బుధవారం ప్రకటించారు. డీఎంకే కూటమిలో ఎండీఎంకే ఆరు స్థానాల్లో పోటీచేస్తున్న విషయం తెలిసిందే. డీఎంకే చిహ్నం ఉదయ సూర్యుడిపై ఈ పార్టీ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే అధికారంలోకి రాగానే, తమ పార్టీ తరఫున అమలు చేయిస్తామని 55 హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ప్రకటించారు.
హామీల్లో కొన్ని..
- హిందీ, సంస్కృతాన్ని రాష్ట్రంలోకి అనుమతించం
- అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం లక్ష్యంగా ముందుకు
- వ్యవసాయాన్ని రక్షించుకుంటాం.ఈ రంగాన్ని నాశనం చేసే రీతిలో తీసుకొచ్చే పథకాలను అడ్డుకుంటాం
- నదుల అనుసంధానానికి చర్యలు, నది జలాల పంపిణీలో చిక్కులు, వివాదాల పరిష్కారానికి సహకారం.
- పరిశ్రమల అభివృద్ధి, పబ్లిక్ రంగ సంస్థల పరిరక్షణ, విద్యుత్ వినియోగం క్రమబద్ధీకరణ, కారి్మక సంక్షేమం,
- అధికారంలోకి డీఎంకే రాగానే, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, రవాణా ఉద్యోగ కార్మికుల డిమాండ్లపై దృష్టి
- అవినీతినిరూపు మాపడం లక్ష్యం, స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారాలు, సంపూర్ణ మద్యనిషేధానికి చర్యలు
- ప్రజా జీవితాల్లో వెలుగు లక్ష్యంగా పథకాల అమలుకు పట్టు, వెనుకబడిన సామాజిక వర్గాలు, మైనారిటీ సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతామన్న హామీలు గుప్పించారు.
చదవండి: చిన్నమ్మ మద్దతు మాకే!
సర్వేలన్నీ ఆ పార్టీ వైపే : 161 నుంచి 169 స్థానాలు!
Comments
Please login to add a commentAdd a comment