MK Stalin: విజయధ్వానాల మోత మోగుతోంది! | Tamil Nadu Election Results Wishes Pour On MK Stalin | Sakshi
Sakshi News home page

MK Stalin: స్టాలిన్‌కు శుభాకాంక్షల వెల్లువ

Published Sun, May 2 2021 6:00 PM | Last Updated on Sun, May 2 2021 7:31 PM

Tamil Nadu Election Results Wishes Pour On MK Stalin - Sakshi

చెన్నై: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీలోని 234 స్థానాలకు గానూ 153 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు.. అధికార అన్నాడీఎంకే 80 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ ఎన్నిక ఖరారైంది. దీంతో, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నేతలు అభినందనలు తెలుపుతున్నారు.

విజయధ్వానాల మోత మోగుతోంది: కేజ్రీవాల్‌
‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్‌ విజయధ్వని మారుమోగిపోతోంది. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, పదవీకాలాన్ని పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

సీఎం జగన్‌ అభినందనలు
తమిళనాడు సీఎంగా పదవి చేపట్టబోతున్న స్టాలిన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఫోన్‌లో ఆయనతో మాట్లాడి విషెస్‌ తెలియజేశారు.

స్టాలిన్‌కు శుభాకాంక్షలు: రాజ్‌నాథ్‌ సింగ్‌
‘‘తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించిన డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌కు, ఆయన పార్టీకి శుభాకాంక్షలు. బెస్ట్‌ విషెస్‌’’ అని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

అద్భుత విజయం ఇది: వి. నారాయణస్వామి
‘‘తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్‌లో ఘన విజయం సాధించి, యూపీఏ కూటమికి గెలుపునందించిన ఎంకే స్టాలిన్‌కు హృదయ పూర్వక అభినందనలు. మీ హయాంలో తమిళనాడు అభివృద్ధి పథంలో నడుస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది’’ అని పుదుచ్చేరి మాజీ సీఎం వి.నారాయణస్వామి ట్విటర్‌ వేదికగా స్టాలిన్‌ను అభినందించారు. వీరితో పాటు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంథీ, పార్టీ నేత శశిథరూర్‌ సహా ఇతరులు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలు మార్పును కోరుకున్నారు: రాహుల్‌ గాంధీ
తమిళనాడు ప్రజలు మార్పును కోరుకున్నారు. అందుకు అనుగుణంగా ఓటువేశారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. మీ నాయకత్వంలో మరింత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తాం. స్టాలిన్‌కు బెస్ట్‌ విషెస్‌.

చదవండి:  తిరుగులేని స్టాలిన్‌.. వార్‌ వన్‌సైడ్‌!?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement