
ఎంపీ కార్తీ చిదంబరం భార్య శ్రీనిధి
సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కోడలు, ఎంపీ కార్తీ చిదంబరం సతీమణి శ్రీనిధి భరత నాట్యం బీజేపీ ఎన్నికల ప్రచార అస్త్రంగా మారింది. బీజేపీ ప్రచార ట్విట్‌లో తన వీడియో కనిపించడంతో శ్రీనిధి తీవ్రంగా ఖండించారు. తమిళనాట ఎన్నికల ప్రచారం వేడెక్కి ఉన్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం సాగుతోంది. ఆ దిశగా బీజేపీ విడుదల చేసిన ప్రచార వీడియోలో ఓ మహిళ భరత నాట్యం చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది.
అయితే, ఆ నాట్యం చేస్తున్న మహిళ కాంగ్రెస్ సీనియర్, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కోడలు శ్రీనిధి కావడంతో వివాదానికి దారి తీసింది. తన వీడియోను ఉపయోగించి బీజేపీ ప్రచారం చేయడాన్ని పరిశీలించిన ఆమె ఇది ఖండించ దగ్గ విషయంగా పేర్కొన్నారు. ఎన్ని ప్రయత్నాలు, కుస్తీలు పట్టినా, కమలంకు తమిళనాట చోటు లేదని, పాదం మోపడం కష్టతరమేని అదే ప్రచార ట్వీట్‌లో శ్రీనిధి కామెంట్లు పెట్టారు. అయితే, కొన్నేళ్ల క్రితం డీఎంకే అధికారంలో ఉన్న సమయయంలో జరిగిన సెమ్మోళి మహానాడులో చిత్రీకరించిన వీడియోగా ఆ నాట్య ప్రదర్శనను గుర్తించారు. దీనిని పరిశీలించకుండానే బీజేపీ వర్గాలు తమ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment