![Election Results 2021: Celebrities Who Contested Assembly Elections 2021 - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/2/996.jpg.webp?itok=GNAf_xx7)
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, నటుడు సురేశ్ గోపీ ఓడిపోయాడు. త్రిస్సూర్ నియోజకవర్గంలో మొదట్లో ఆధిక్యంలో ఉన్న సురేశ్ గోపీ చివరికి మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించారు. డీఎంకే పార్టీకి కంచుకోట అయిన చెపాక్ నియోజకవర్గంనుంచి దాదాపు 60 వేల మెజార్టీతో గెలుపొందారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నటి ఖుష్బూ ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఖుష్బూ చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, ఆమె తన సమీప ప్రత్యర్థి డీఎంకే నేత ఎళిలన్ చేతిలో ఓటమి పాలయ్యారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్(బీజేపీ)పై స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment