
చెన్నె: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాలు వాడివేడీగా కొనసాగుతున్నాయి. తొలిసారి జయలలిత, కరుణానిధి లేని అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలపై వారి ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఈ నేపథ్యంలోనే డీఎంకే అధినేత స్టాలిన్ సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో అధికార పార్టీ అన్నాడీఎంకేను ఇరుకున పడేసేలా చేసింది. తాము అధికారంలోకి వస్తే అమ్మ (జయలలిత) మృతి వెనుక ఉన్న రహాస్యాలను చేధిస్తామని ప్రకటించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రోయపురంలో నిర్వహించిన కార్యక్రమంలో స్టాలిన్ ఈ మేరకు ప్రకటన చేశారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం జయలలిత మృతి విషయంలో వాస్తవాలు చెప్పడం లేదని
ఆరోపించారు. అమ్మ మృతి వెనుక ఉన్న మిస్టరీని చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పళని, పన్నీర్ ఆసక్తి కనబర్చడం లేదని ఆరోపించారు. తమ ఎన్నికల మ్యానిఫెస్టోను అన్నాడీఎంకే కాపీ కొట్టిందని విమర్శించారు. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుంది. నామినేషన్ దాఖలుకు ఆఖరు తేదీ మార్చి 19, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 22 వరకు అవకాశం ఉంది. అనంతరం ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగనుంది.
చదవండి: తాజా మాజీ ముఖ్యమంత్రికి అధిష్టానం షాక్
Comments
Please login to add a commentAdd a comment