
టీ.నగర్: ప్రముఖ గ్లామర్ తార నటి షకీలా గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మలయాళ చిత్రాల్లో నటించి పేరొందిన షకీలా రాష్ట్ర కాంగ్రెస్ మానవ హక్కుల విభాగం అధ్యక్షుడు మహాత్మా శ్రీనివాసన్ సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు రాష్ట్ర కాంగ్రెస్ మానవ హక్కుల విభాగం ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. షకీలా శుక్రవారం చెన్నైలోని సత్యమూర్తి భవన్‌కు వచ్చి పార్టీ అధ్యక్షుడు, ఇతర ముఖ్య నిర్వాహకులను కలిసి సభ్యత్వ కార్డును అందుకున్నారు. ఈమె శనివారం నుంచి ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం.