pratap C reddy
-
అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 'వైద్యరంగంలో ఆధునిక భారత ఆరోగ్య సంరక్షణ రూపశిల్పిగా పరిగణించబడుతున్న ప్రతాప్ సి. రెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎల్లప్పుడూ ఆయన సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు' పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ శనివారం ట్వీట్ చేశారు. Warm greetings on the 91st birthday to Sri Pratap C Reddy Garu, Founder-Chairman of Apollo hospitals, a revered fatherly figure in the medical fraternity and widely regarded as an architect of modern Indian healthcare. May God bless him with a happy and healthy life ahead. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 5, 2022 చదవండి: (Anantapur: అనంత గర్భం.. అరుదైన ఖనిజం) -
శ్రీవారి సేవలో మంత్రి బొత్స, పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుమల: మంత్రి బొత్స సత్యనారాయణ తిరుమల వేంకటేశ్వర స్వామిని మంగళవారం వేకువజామున దర్శించుకున్నారు. అక్కడి నుంచి కాణిపాకం వినాయకుడిని దర్శించుకుని తిరుచానూరు చేరుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి అమ్మవారి దర్శనాంతరం మొక్కలు చెల్లించుకున్నారు. మంత్రి పర్యటనలో సూపరింటెండెంట్ శేషగిరి, వీజీఓ మనోహర్, ఏవీఎస్ఓ వెంకటరమణ, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు తదితరులు ఉన్నారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా.. ఈ సమయంలోనే శ్రీవారిని ధర్మవరం ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డి, అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి దంపతులు దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. -
శ్రీవారి సేవలో మంత్రి బొత్స
-
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
సాక్షి, తిరుమల: కలియుగ వైకుంఠదైవం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ దర్శనం లో అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యుడు శివకుమార్, అనకాపల్లి ఎంపీ సత్యవతి, తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, తెలంగాణ ఎమ్మెల్సీ లక్ష్మీరావు, తెలంగాణ ఐఎఎస్ శ్రీనివాసు రాజు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు శివకుమార్ మాట్లాడుతూ.. గోవు అంతరించిపోకముందే వాటిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి మాట్లాడుతూ.. స్వామివారి కృపతో అపోలో ద్వారా మరింత సేవ చెయ్యాలని కోరుకుంటున్నా అన్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అపోలో భాగస్వామ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్‌తో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అపోలో ఆసుపత్రుల్లో వైద్యానికి రూ.40 లక్షల వరకు రుణాన్ని బ్యాంకు తన కస్టమర్లకు అందిస్తుంది. అవసరమైన వెంటనే ఈ లోన్‌ను మంజూరు చేస్తారు. అపోలో 24/7 డిజిటల్ ప్లాట్‌ఫాంపై వైద్యులను ఉచితంగా సంప్రదించవచ్చు. చికిత్స విషయంలో తమ కస్టమర్లకు ప్రాధాన్యత ఉంటుందని హెచ్డీఎఫ్సీ సీఈవో, ఎండీ ఆదిత్య పురి బుధవారం మీడియాకు తెలిపారు. ఆరోగ్య, ఆర్థిక రంగంపై ఈ భాగస్వామ్యం సానుకూల ప్రభావం చూపిస్తుందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ఉన్న 6.5 కోట్ల మంది కస్టమర్లకు ఇది ప్రయోజనమని అపోలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని తెలిపారు. -
అపోలో హాస్పిటల్స్ లాభం 80 శాతం అప్
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) డిసెంబర్ క్వార్టర్లో 80% ఎగసింది. గతేడాది (2018–19) క్యూ3లో రూ.50 కోట్లుగా ఉన్న లాభం ఈ క్యూ3లో రూ.90 కోట్లకు పెరిగిందని అపోలో హాస్పిటల్స్తెలిపింది. అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరచడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపనీ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.2,495 కోట్ల నుంచి రూ.2,912 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.3.25 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. -
జయ ఆరోగ్యంపై అబద్ధాలు చెప్పాం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరినప్పుడు, ఆమె ఆరోగ్య పరిస్థితిపై అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందని అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే అలా చేశామని చెన్నైలో మీడియాతో చెప్పారు. జయ∙ఆసుపత్రిలో చేరినప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకూడదనే ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు బులెటిన్ విడుదల చేశామని వివరించారు. తర్వాత ఆమె కోలుకున్నారని చెప్పారు. ఆమె మరణంపై ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున ఇంతకంటే వివరాలు చెప్పలేనన్నారు. జయలలిత ఆసుపత్రిలో ఇడ్లీ తినడం తాము చూశామని అబద్ధాలు చెప్పినట్లు మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
'జయ మరణంపై విచారణకు మేం రెడీ'
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వైద్య చికిత్సలలో ఎలాంటి పొరబాటు లేదని, ఆమె మరణంపై విచారణకు సిద్ధమని అపోలో హాస్పిటల్స్ గ్రూప్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రిగా సేవలందించిన జయలలితకు 2016 సెప్టెంబరులో హఠాత్తుగా అస్వస్థత ఏర్పడింది. దీంతో థౌజండ్‌లైట్స్ అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఆమెకు 70 రోజులకు పైగా చికిత్సలందించారు. ఆరోగ్యం కోలుకుంటున్నట్లు తెలుస్తుండగానే గత(2016) డిసెంబర్ 5న హఠాత్తుగా జయలలిత మృతి చెందారు. దీంతో ఆమె మృతిపై అనేక అనుమానాలున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె మృతిలో అనుమానం ఉందని, దీని గురించి న్యాయవిచారణ జరపాలంటూ ఓ.పన్నీర్‌సెల్వం డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనిపై అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ జయలలిత మరణంపై ఎటువంటి విచారణ జరిపినా దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జయలలితకు అందచేసిన చికిత్సలలో ఎటువంటి పొరపాటు జరగలేదని ఆమె చికిత్సలలో ఎవరూ జోక్యం చేసుకోలేదన్నారు. చెన్నైలో మంగళవారం అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అపోలో మెమొరి, హెడేక్, మైగ్రేన్ క్లినిక్స్‌ను డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి ప్రారంభించి పైవిధంగా స్పందించారు. -
అమ్మ మాట
► మైక్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి జయ ► డిశ్చార్జ్ ఆమె అభీష్టమే ► అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత మైక్ సహాయంతో కొద్దిసేపు మాట్లాడారని, ఆమె ఆరోగ్యం సాధారణస్థితికి చేరుకుందని అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలితకు దేశ, విదేశీ వైద్యులు సుమారు రెండు నెలలపాటు చికిత్సను అందించారు. ఆమె ఆస్పత్రిలో చేరి శుక్రవారానికి 64 రోజులు పూర్తరుుంది. ముఖ్యమంత్రి బాగా కోలుకున్నట్లు రెండువారాల క్రితమే అపోలో అధినేత ప్రతాప్ సీ రెడ్డి ప్రకటించారు. అవయవదానంపై అపోలో ఆస్పత్రి శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఫిజియోథెరపీ వల్ల ముఖ్యమంత్రి సహజస్థితికి చేరుకున్నారని చెప్పారు. మైక్ సహాయంతో కొద్ది నిమిషాలు ఆమె మాట్లాడారని, 90 శాతం వరకూ ఆమె సహజసిద్ధంగా శ్వాస తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అపోలో ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ కావాలని ముఖ్యమంత్రి మనస్సులో ఉందో తెలుసుకునేందుకు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నామని తెలిపారు. డిశ్చార్జ్ ఎప్పుడనేది ఆమె అభీష్టమని, ఎప్పుడైనా ఇంటికి వెళ్లవచ్చని ఆయన తెలియజేశారు. -
ఆస్పత్రి నుంచే పాలన
► సమస్యలపై సలహాలు ఇస్తున్నారు అన్నాడీఎంకే వర్గాల వెల్లడి ► సీఎం కోరితే డిశ్చార్జ్: ప్రతాప్ సీ రెడ్డి అనారోగ్య కారణంగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రి నుంచి పరిపాలన సాగిస్తున్నట్లు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. జాలర్ల సమస్య, కావేరీ జల వివాదాలపై పార్లమెంటు సమావేశాల్లో స్పందించాల్సిన విధానంపై ఎంపీలకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కోరితే డిశ్చార్జ్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి అపోలో ఆస్పత్రిలో చేరి శుక్రవారానికి 57 రోజులైంది. ముఖ్యమంత్రి పూర్తిగా కోలుకున్నందున దీపావళికి ముందే డిశ్చార్జ్ అవుతారని ప్రచారం జరిగింది. అరుుతే దీపావళి ముగిసి రెండు వారాలు దాటినా డిశ్చార్జ్ తేదీ ఖరారు కాలేదు. మరో రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ ఖాయమని పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారుు. ఇదిలా ఉండగా, ఆస్పత్రిలో పడకపై కూర్చుని టీవీలు చూస్తున్నారని, పత్రికలను చదువుతున్నారని కూడా అపోలో వర్గాలు తెలిపారుు. వెంటిలేటర్ అవసరం లేకుండానే రోజుకు 24 గంటల్లో 20 గంటల పాటు సహజ రీతిలో శ్వాసను తీసుకునే స్థారుులో ఆమె ఆరోగ్యం పుంజుకోగా, నిద్రపోయే సమయంలో మాత్రమే కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్లు ఆమె పూర్తిగా కోలుకున్నట్లు చెబుతున్నారు. నిద్రపోయే వేళల్లో సైతం వెంటిలేటర్ తొలగించేందుకు వైద్యులు నిర్ణరుుంచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పక్కపై నుంచే ప్రభుత్వ పరిపాలన కూడా సాగిస్తున్నట్లు అన్నాడీఎంకే నేతలు శుక్రవారం చెప్పారు. మంత్రులు, ఉన్నతాధికారులకు ఆసుపత్రి నుంచే తగిన సూచనలు ఇస్తున్నారని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున తమిళనాడుకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించాల్సిందిగా అన్నాడీఎంకే ఎంపీలకు సూచించారని వారు తెలిపారు. జయ సూచన మేరకే తమ రాజ్యసభ సభ్యులు కావేరీ అంశంపై సమావేశాల్లో ఆవేశంగా మాట్లాడారని అంటున్నారు. పీఎంతో సమావేశం తమిళ జాలర్లపై శ్రీలంక సముద్రతీర గస్తీ దళాలు జరిపిన కాల్పుల నేపథ్యంలో అన్నాడీఎంకే ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీని శుక్రవారం కలిశారు. పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ తంబిదురై నేతృత్వంలో అన్నాడీఎంకే పార్లమెంటు, రాజ్యసభ సభ్యులు ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. తమిళనాడుకు చెందిన జాలర్లపై శ్రీలంక దాష్టీకం పెరిగిపోతోంది. నాగపట్టినం జిల్లా కోడియక్కరై సమీపం పాక్జలసంధిలో చేపలుపడుతున్న సమయంలో శ్రీలంక దళాలు కాల్పులు జరపగా ఇద్దరు జాలర్లు తీవ్రంగా గాయపడి పుదుచ్చేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారతదేశంలోని శ్రీలంక రాయబారిని పిలిపించి కాల్పుల సంఘటనపై ఆయన వద్ద ఖండించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తంబిదురై ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాల మేరకే తాము ప్రధానిని కలిసి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. డిశ్చార్జ్ సీఎం ఇష్టమే: అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ కావాలో ఆమె అభీష్టానికే వదిలేసినట్లు అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. చెన్నైలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ శారీరకంగా ఆమె పూర్తిగా కోలుకున్నారని, అరుుతే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకకూడదనే అత్యవసర చికిత్స విభాగంలో ఉంచినట్లు తెలిపారు. సుమారు ఎనిమిది వారాలుగా పడకపైనే ఉండడంతో అవయవాల పనితీరు మెరుగు కోసం ఫిజియోథెరపీ అందిస్తూ వచ్చినట్లు తెలిపారు. జయలలిత కోరిన పక్షంలో డిశ్చార్జ్ చేసేందుకు తాము సిద్ధమని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి జయలలిత మరో మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని అన్నాడీఎంకే కేంద్ర కార్యాలయ అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ అన్నారు. సీఎంను పరామర్శించేందుకు శుక్రవారం అపోలో ఆసుపత్రికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జయలలిత చాలా వేగంగా కోలుకుంటున్నారని అపోలో చైర్మన్ తనకు చెప్పారని, మూడు రోజుల్లో ఇంటికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. -
పట్టుతప్పి పడిపోబోయిన అపోలో చైర్మన్
విశాఖ: నగరంలో ఆదివారం ప్రారంభమైన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) 22వ భాగస్వామ్య సదస్సు కు హాజరైన అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కాలుజారి పడిపోబోయారు. భాగస్వామ్య సదస్సు జరుగుతున్న సమయంలో ప్రతాప్ రెడ్డి కాలు పట్టుతప్పడంతో కిందికి పడబోయారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను పట్టుకోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. 'సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఏపీ ఇన్వెస్టర్స్ మీట్' పేరుతో విశాఖలోని హార్బర్ పార్కు సమీపంలోని ఏపీఐఐసీ మైదానంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజుపీయూష్ గోయల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. -
చెన్నై అపోలో ఆస్పత్రికి అరుదైన ఘనత
కొరుక్కుపేట: చెన్నై అపోలో ఆస్పత్రి అరుదైన ఘనత సాధించింది. బ్రెయిన్‌డెడ్ అయిన ఐదుగురు జీవన్మృతుల అవయవాలను వారి కుటుంబ సభ్యులు దానం చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో ఒకో రోజు ఐదుగురి నుంచి 23 అవయవాలను సేకరించడం ద్వారా అరుదైన ఘనత సాధించింది. దీనికి సంబంధించిన వివరాలను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. మద్రాసు, పుదుచ్చేరికి చెందిన ఐదుగురు ప్రమాదంలో గాయాలపాలై బ్రెయిన్‌డెడ్ అవడంతో వారి అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు వచ్చారని చెప్పారు. ఒక్క రోజులో ఐదుగురు నుంచి 23 అవయవాలను స్వాధీనం చేసుకున్నామని... దీని వలన 23 మందికి పునర్జన్మ ఇచ్చేందుకు అవకాశం కలిగిందని ఇది ఎంతో అరుదైన ఘనత అన్నారు. 23 అవయవాల్లో ఐదు లివర్లు, ఒక గుండె, నాలుగు కిడ్నీలు అపోలో ఆసుపత్రి తీసుకోగా, మిగిలిన ఒక గుండెను చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రికి, నాలుగు కిడ్నీలు కోయంబత్తూరు కేజీహెచ్‌కు, ఒక కిడ్నీ కామాక్షి ఆసుపత్రికి, ఒక కిడ్నీ గ్లోబల్ ఆస్పత్రికి, ఆరు నేత్రాలను శంకర్ నేత్రాలయాకు అందించినట్లు తెలిపారు. -
కోదండరామునికి శఠారి కానుక
తిరుపతిలోని కోదండరామునికి అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి రూ. 24 లక్షల విలువచేసే బంగారు శఠారిని కానుకగా ఇచ్చారు. సోమవారం ఉదయం ఆయన కుటుంబసభ్యులతో కలసి ఆలయానికి చేరుకున్నారు. నైవేద్య విరామ సమయంలో తిరువుల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి వెండి సింహ వాహనాన్ని త్వరలో సమర్పిస్తానని కూడా తెలిపారు. - తిరుపతి/తిరుమల/శ్రీకాళహస్తి -
ప్రతాప్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం
అపోలో ఆస్పత్రుల చైర్మన్ జీవిత కథ ‘హీలర్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జానా సాక్షి, హైదరాబాద్: వైద్యరంగంలో డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి సేవలు చిరస్మరణీయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అపోలో ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి జీవిత చరిత్ర ‘హీలర్: డాక్టర్ ప్రతాప్ చంద్రరెడ్డి అండ్ ది ట్రాన్స్ఫార్మేషన్స్ ఆఫ్ ఇండియా’ పుస్తకావిష్కరణ బుధవారం ఇక్కడి అపోలో హెల్త్ సిటీలో జరిగింది. మంత్రి జానారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అపోలో ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం ద్వారా ప్రతాప్‌రెడ్డి విదేశీయులను ఆకర్షిస్తున్నారంటూ ఆయన సేవలను ప్రశంసించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. 1980 తర్వాత దేశానికి సూపర్‌స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత ప్రతాపరెడ్డికే దక్కుతుందన్నారు. 30 ఏళ్లుగా ప్రతాప్‌రెడ్డి 37 మిలియన్ల మంది రోగుల జీవితాల్లో వెలుగులు నింపారని పుస్తక రచయిత, చరిత్రకారుడు ప్రణ్య్గుప్తా కొనియాడారు. 600 పేజీలు గల ఈ హీలర్ పుస్తక ప్రతిని ప్రతాప్‌రెడ్డి కొన్ని రోజుల క్రితం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి అందించగా.. అధికారికంగా పుస్తకావిష్కరణ బుధవారం జరిగింది. అనంతరం తొలి ప్రతిని ప్రతాప్‌రెడ్డి తన సతీమణి సుచరితారెడ్డికి అందించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. తన తండ్రి రాఘవరెడ్డి ఆదేశాల మేరకే ఒకప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చానన్నారు. గతంలో ఇక్కడి రోగులకు ఏ చిన్న సమస్య వచ్చినా విదేశీ వైద్యులను ఆశ్రయించాల్సి వచ్చేదని, సకాలంలో వైద్యం అందక అనేక మంది మృత్యువాతపడేవారని చెప్పారు. దీంతో సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలను కార్డియాలజీ విభాగంలో ప్రారంభించినట్లు తెలిపారు. అమెరికా, ఇంగ్లాండ్ వంటి అభివృద్ది చెందిన దేశాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ ధరకే మెరుగైన వైద్యం అందుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు రాంచరణ్, అపోలో డెరైక్టర్ సంగీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.