► సమస్యలపై సలహాలు ఇస్తున్నారు అన్నాడీఎంకే వర్గాల వెల్లడి
► సీఎం కోరితే డిశ్చార్జ్: ప్రతాప్ సీ రెడ్డి
అనారోగ్య కారణంగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రి నుంచి పరిపాలన సాగిస్తున్నట్లు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. జాలర్ల సమస్య, కావేరీ జల వివాదాలపై పార్లమెంటు సమావేశాల్లో స్పందించాల్సిన విధానంపై ఎంపీలకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కోరితే డిశ్చార్జ్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి అపోలో ఆస్పత్రిలో చేరి శుక్రవారానికి 57 రోజులైంది. ముఖ్యమంత్రి పూర్తిగా కోలుకున్నందున దీపావళికి ముందే డిశ్చార్జ్ అవుతారని ప్రచారం జరిగింది. అరుుతే దీపావళి ముగిసి రెండు వారాలు దాటినా డిశ్చార్జ్ తేదీ ఖరారు కాలేదు. మరో రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ ఖాయమని పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారుు. ఇదిలా ఉండగా, ఆస్పత్రిలో పడకపై కూర్చుని టీవీలు చూస్తున్నారని, పత్రికలను చదువుతున్నారని కూడా అపోలో వర్గాలు తెలిపారుు. వెంటిలేటర్ అవసరం లేకుండానే రోజుకు 24 గంటల్లో 20 గంటల పాటు సహజ రీతిలో శ్వాసను తీసుకునే స్థారుులో ఆమె ఆరోగ్యం పుంజుకోగా, నిద్రపోయే సమయంలో మాత్రమే కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్లు ఆమె పూర్తిగా కోలుకున్నట్లు చెబుతున్నారు.
నిద్రపోయే వేళల్లో సైతం వెంటిలేటర్ తొలగించేందుకు వైద్యులు నిర్ణరుుంచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పక్కపై నుంచే ప్రభుత్వ పరిపాలన కూడా సాగిస్తున్నట్లు అన్నాడీఎంకే నేతలు శుక్రవారం చెప్పారు. మంత్రులు, ఉన్నతాధికారులకు ఆసుపత్రి నుంచే తగిన సూచనలు ఇస్తున్నారని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున తమిళనాడుకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించాల్సిందిగా అన్నాడీఎంకే ఎంపీలకు సూచించారని వారు తెలిపారు. జయ సూచన మేరకే తమ రాజ్యసభ సభ్యులు కావేరీ అంశంపై సమావేశాల్లో ఆవేశంగా మాట్లాడారని అంటున్నారు.
పీఎంతో సమావేశం
తమిళ జాలర్లపై శ్రీలంక సముద్రతీర గస్తీ దళాలు జరిపిన కాల్పుల నేపథ్యంలో అన్నాడీఎంకే ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీని శుక్రవారం కలిశారు. పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ తంబిదురై నేతృత్వంలో అన్నాడీఎంకే పార్లమెంటు, రాజ్యసభ సభ్యులు ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. తమిళనాడుకు చెందిన జాలర్లపై శ్రీలంక దాష్టీకం పెరిగిపోతోంది. నాగపట్టినం జిల్లా కోడియక్కరై సమీపం పాక్‌జలసంధిలో చేపలుపడుతున్న సమయంలో శ్రీలంక దళాలు కాల్పులు జరపగా ఇద్దరు జాలర్లు తీవ్రంగా గాయపడి పుదుచ్చేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారతదేశంలోని శ్రీలంక రాయబారిని పిలిపించి కాల్పుల సంఘటనపై ఆయన వద్ద ఖండించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తంబిదురై ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాల మేరకే తాము ప్రధానిని కలిసి వినతిపత్రం సమర్పించామని తెలిపారు.
డిశ్చార్జ్ సీఎం ఇష్టమే: అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి
ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ కావాలో ఆమె అభీష్టానికే వదిలేసినట్లు అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. చెన్నైలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ శారీరకంగా ఆమె పూర్తిగా కోలుకున్నారని, అరుుతే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ సోకకూడదనే అత్యవసర చికిత్స విభాగంలో ఉంచినట్లు తెలిపారు. సుమారు ఎనిమిది వారాలుగా పడకపైనే ఉండడంతో అవయవాల పనితీరు మెరుగు కోసం ఫిజియోథెరపీ అందిస్తూ వచ్చినట్లు తెలిపారు. జయలలిత కోరిన పక్షంలో డిశ్చార్జ్ చేసేందుకు తాము సిద్ధమని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి జయలలిత మరో మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని అన్నాడీఎంకే కేంద్ర కార్యాలయ అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ అన్నారు. సీఎంను పరామర్శించేందుకు శుక్రవారం అపోలో ఆసుపత్రికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జయలలిత చాలా వేగంగా కోలుకుంటున్నారని అపోలో చైర్మన్ తనకు చెప్పారని, మూడు రోజుల్లో ఇంటికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు.
ఆస్పత్రి నుంచే పాలన
Published Sat, Nov 19 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM
Advertisement
Advertisement