
సాక్షి, తిరుమల: మంత్రి బొత్స సత్యనారాయణ తిరుమల వేంకటేశ్వర స్వామిని మంగళవారం వేకువజామున దర్శించుకున్నారు. అక్కడి నుంచి కాణిపాకం వినాయకుడిని దర్శించుకుని తిరుచానూరు చేరుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి అమ్మవారి దర్శనాంతరం మొక్కలు చెల్లించుకున్నారు. మంత్రి పర్యటనలో సూపరింటెండెంట్ శేషగిరి, వీజీఓ మనోహర్, ఏవీఎస్ఓ వెంకటరమణ, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు తదితరులు ఉన్నారు.
పలువురు ఎమ్మెల్యేలు కూడా..
ఈ సమయంలోనే శ్రీవారిని ధర్మవరం ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డి, అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి దంపతులు దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment