tirumala sri venkateswara swamy temple
-
తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు ప్యాకెట్
ఖమ్మంరూరల్: దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం తీసుకొచ్చిన లడ్డూలో పొగాకుతో కూడిన ప్యాకెట్ రావడంతో భక్తులు నివ్వెరపోయిన ఘటన ఇది. ఖమ్మం రూరల్ మండలంలోని గొల్లగూడెం గ్రామపంచాయతీ శివారు కార్తికేయ టౌన్‌షిప్‌కు చెందిన దొంతు పద్మావతి బంధువులతో కలిసి ఈనెల 19న తిరుమల వెళ్లారు. అక్కడ 20వ తేదీన సర్వదర్శనం ద్వారా స్వామిని దర్శించుకున్నాక లడ్డూలు కొనుగోలు చేయగా ఆదివారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. కాగా, ఉదయం లడ్డూ ప్రసాదాన్ని ఇంట్లో దేవుడి వద్ద ఉంచి బంధువులకు ఇచ్చేందుకు ముందు కొద్దిగా నోట్లో వేసుకోగా పొగాకు వాసన వచ్చింది. దీంతో పద్మావతి లడ్డూ మొత్తం చూడగా అందులో పొగాకుతో కూడిన ప్యాకెట్ కనిపించింది. కాస్త నమిలిన పొగాకును కాగితంలో చుట్టగా అది లడ్డూలో కలిసిపోయి ఉంది. దీంతో ఆమె పలువురికి చూపించగా పద్మావతితో పాటు వెళ్లిన మిగతా వారు తీసుకొచ్చిన వారు తెచ్చిన లడ్డూలు బాగానే ఉన్నాయి. కాగా, పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో ఇలా రావడంపై పద్మావతి సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
అక్టోబరు 4 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబరు 4 నుంచి12 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈఓ శ్యామలరావు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందన్నారు. అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మంలతో కలిసి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈఓ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబరు 4న ధ్వజారోహణం ఉంటుందని, అదేరోజు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వర స్వామికి పట్టువ్రస్తాలు సమరి్పస్తారని తెలిపారు. ఈఓ వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలు.. 👉 ఉ.8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 వరకు వాహన సేవలు జరుగుతాయి. గరుడ వాహన సేవ సా.6.30 గంటలకు ప్రారంభమవుతుంది. 👉 భక్తుల రద్దీ శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. 👉 అక్టోబరు 4 నుంచి 12 వరకు కాటేజీ దాతలకు గదుల కేటాయింపు ఉండదు. తిరుమలలో నీటి లభ్యతపై అపోహలొద్దు.. ఇదిలా ఉంటే.. శనివారం నాటికి తిరుమలలో కుమారధార, పసుపుధార, పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం డ్యాంలలో కలిపి 4,592 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉందని.. నీటి లభ్యతపై అపోహలొద్దని ఈఓ శ్యామలరావు కోరారు. తిరుపతిలోని కల్యాణి డ్యాంలో 5,608 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉన్నందున శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అదనపు నీటి అవసరాలతో సహా 130 రోజుల వరకు ఈ నీరు సరిపోతుందని ఆయన చెప్పారు. లాగే, కల్యాణి డ్యాం నుండి 11 లక్షల గ్యాలన్ల నీటిని అదనంగా సరఫరా చేయడానికి తిరుపతి మున్సిపల్ కమిషనర్ అంగీకరించారని.. తద్వారా అదనంగా మరో నెలరోజులు తిరుమల నీటి అవసరాలు తీరుతాయని ఆయన చెప్పారు. అంతేకాక.. కైలాసగిరి రిజర్వాయర్ నుండి మరో 10 ఎంఎల్డీ నీరు తిరుపతికి సరఫరా కానుందని ఆయన వివరించారు. ఇక తిరుపతికి నీటి సరఫరాను పెంచడానికి అదనపు పైప్‌లైన్ నిమిత్తం టీటీడీ రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు కూడా శ్యామలరావు వెల్లడించారు. -
Tirumala: శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుపతి: తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఉగాది పండగ కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలలో కనిపించడం లేదు. క్యూకాంప్లెక్స్‌లో 4 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న (మంగళవారం) 55,756 మంది స్వామివారిని దర్శించుకోగా 17,866మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 2.71 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతుండగా.. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
జూలైలో తిరుమలలో విశేష ఉత్సవాలు ఇవే...
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ పీఆర్ఓ విభాగం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. జూలై 1న శని త్రయోదశి, 3న ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూజ, గురుపూర్ణిమ, 13న సర్వఏకాదశి, 15న శని త్రయోదశి, 17న శ్రీవారి ఆణివార ఆస్థానం, 22న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర, శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేయడం, 30న నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం ఉంటాయని తెలిపింది. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శనివారం అర్ధరాత్రి వరకు 83,889 మంది స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీల్లో రూ.3.10 కోట్లు సమర్పించుకున్నారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని భక్తులకు దర్శనానికి 24 గంటలు పడుతోంది. తిరుమల శ్రీవారిని ఆదివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సాంబశివరావు నాయుడు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆయనకు ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. సినీ గాయని సునీత, ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. -
శ్రీవారి సేవలో నాగార్జున దంపతులు
తిరుమల శ్రీవారిని సినీ నటుడు అక్కినేని నాగార్జున దంపతులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నైవేద్య విరామ సమయంలో అక్కినేని నాగార్జున, అమల దంపతులు కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. (చదవండి: అజిత్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మళ్లీ తెరపైకి ‘అమరావతి’) అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడుతూ... ఏడాది కాలం తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు..త్వరలో మా ఇద్దరు అబ్బాయిల సినిమా విడుదల అవుతున్నాయని, ఇద్దరూ చాలా కష్టపడి సినిమాలు చేశారని, కేవలం కష్టం ఒకటే కాదని, శ్రీవారి ఆశీస్సులు కూడా ఉండాలని స్వామి వారి దర్శనార్థం వచ్చాంమని అక్కినేని నాగార్జున అన్నారు. అనంతరం అమల మీడియాతో మాట్లాడుతూ.. అఖిల్ నటించిన ఏజెంట్, నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ఘన విజయం సాధించాలని శ్రీనివాసుడిని కోరుకున్నట్లు అమల తెలిపారు.. -
శ్రీవారికి బంగారు వరద–కటి హస్తాలు విరాళం
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి సుమారు రూ.3 కోట్లు విలువ చేసే బంగారు వరద–కటి హస్తాలను పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ భక్తుడు శుక్రవారం విరాళంగా అందించారు. వజ్రాలు, కెంపులు పొదిగిన దాదాపు 5.3 కిలోల బరువున్న ఈ బంగారు వరద–కటి హస్తాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి దాత అందజేశారు. -
శ్రీవారి సేవలో మంత్రి బొత్స, పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుమల: మంత్రి బొత్స సత్యనారాయణ తిరుమల వేంకటేశ్వర స్వామిని మంగళవారం వేకువజామున దర్శించుకున్నారు. అక్కడి నుంచి కాణిపాకం వినాయకుడిని దర్శించుకుని తిరుచానూరు చేరుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి అమ్మవారి దర్శనాంతరం మొక్కలు చెల్లించుకున్నారు. మంత్రి పర్యటనలో సూపరింటెండెంట్ శేషగిరి, వీజీఓ మనోహర్, ఏవీఎస్ఓ వెంకటరమణ, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు తదితరులు ఉన్నారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా.. ఈ సమయంలోనే శ్రీవారిని ధర్మవరం ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డి, అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి దంపతులు దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. -
శ్రీవారి సేవలో మంత్రి బొత్స
-
తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు సీజే
సాక్షి, తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ తొలిసారి తిరుమలకు వచ్చారు. గురువారం సాయంత్రం తిరుమలలో జస్టిస్ ఎన్వీ రమణకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన, ఈవో జవహర్‌రెడ్డి, ధర్మారెడ్డి స్వాగతం పలికారు. కాసేపట్లో శ్రీవారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు. ఆయన రాక సందర్భంగా తిరుమలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. -
కాలి నడకన తిరుపతి కొండెక్కిన యంగ్ హీరో
దేవుడి ముందు అందరు సమానమే. సామాన్యులకైనా, సెలబ్రిటీలకైనా ఆ పరమాత్ముడు ఒక్కడే. కానీ ఆ దేవుడిని దర్శించుకునే విషయంలో మాత్రం చాలా తేడాలున్నాయి. సామాన్యులు దేవుడిని దర్శించుకుంటే అది సర్వసాధారణం. కానీ, సెలబ్రిటీలు దేవుడి దర్శనం కోసం వెళ్తే అది విశేషం. అందులోనూ సినిమా నటులు దైవ దర్శనం చేసుకుంటే అక్కడున్నవాళ్లకు అది ఆసక్తికరం. ఇలాంటి ఆసక్తికర ఘటన బుధవారం తిరుమలలో చోటుచేసుకుంది. యంగ్ హీరో నితిన్ కాలినడక తిరుమల వెళ్లాడు. సామాన్య భక్తుల మాదిరి నడుచుకూంటూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య షాలినితో కలిసి బుధవారం ఉదయం నితిన్ హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన నితిన్.. షాలిని కారులో కొండపైకి పంపించి, ఒక్కడే నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నాడు. కాగా, నితిన్ కాలి నడకన తిరుమల వెళ్తున్న వీడియోను ఒక అభిమాని ట్విట్టర్లో షేర్ చేశాడు. ఈ వీడియోను రీట్వీట్ చేసిన నితిన్.. ‘‘ఓం నమో వెంకటేశాయ’’ అని రాశారు. 2.20 గంటల్లో తిరుమల మెట్లు ఎక్కి ఆ ఏడుకొండలవాడిని దర్శించుకున్నాడట. ఈ విషయాన్ని నితిన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ్‌దే’. ఈ సినిమా మార్చి 26న విడుదల కానున్నది. ఈ సినిమాతో పాటు అంధాధున్ తెలుగు రీమేక్, చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో ‘చెక్’ సినిమాల్లో నితిన్ నటిస్తున్నాడు. Om Namoo Venkateshayaa 🙏🙏 https://t.co/s3MC21NXsb — nithiin (@actor_nithiin) January 6, 2021 . -
కానిస్టేబుల్‌కు టీటీడీ చైర్మన్ అభినందనలు
సాక్షి, తిరుమల: కానిస్టేబుల్ షేక్ అర్షద్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా అర్షద్‌కు అభినందనలు తెలిపారు. ‘60 ఏళ్ల మహిళను ఆరు కిలోమీటర్ల దూరం అడవి గుండా తిరుమలకు మోసుకొచ్చావు. భక్తురాలికి నీవు చేసిన సేవ అభినందనీయం. నీ సేవలను గుర్తించాలని డీజీపీకి చెబుతాను' అని కడప స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌ను అభినందించారు. రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి ఆకేపాడు నుంచి తిరుమలకు అన్నమయ్య మార్గంలో ఇటీవల మహా పాదయాత్ర జరిపిన విషయం తెలిసిందే. (చదవండి: శ్రీవారి భక్తురాలికి తనే వాహనమయ్యాడు) ఆ పాదయాత్రలో పాల్గొన్న నందలూరుకు చెందిన 60 ఏళ్ల నాగేశ్వరమ్మ ఈ నెల 23వ తేదీ అటవీప్రాంతంలో అస్వస్థతకు గురై సొమ్మసిల్లిపోయారు. పాదయాత్ర భద్రత డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ అర్షద్.. ఆమెను తన భుజాల మీద వేసుకుని తిరుమలకు మోసుకొచ్చి అశ్విని ఆసుపత్రిలో చేర్పించాడు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా వెలువడింది. టీటీడీ చైర్మన్ ... కానిస్టేబుల్ వివరాలు, సెల్ నంబర్ తెలుసుకుని ఫోన్ చేసి అభినందించారు. మీ లాంటి వారి సేవలు ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని చెప్పారు. వేంకటేశ్వర స్వామి ఇచ్చిన శక్తితోనే ఆ భక్తురాలిని ఆరు కిలోమీటర్ల మేర మోసుకెళ్లానని కానిస్టేబుల్ అర్షద్ చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. -
శ్రీవారి భక్తురాలికి తనే వాహనమయ్యాడు
సాక్షి, రాజంపేట టౌన్: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతూ సొమ్మసిల్లి పడిపోయిన ఓ భక్తురాలిని ఆరు కిలోమీటర్లు మోసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించాడో పోలీస్. వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఇటీవల చేపట్టిన తిరుమల పాదయాత్ర విధుల్లో స్పెషల్ పార్టీ పోలీస్ షేక్ అర్షద్ పాల్గొన్నారు. ఇదే పాదయాత్రలో నందలూరు మండలానికి చెందిన 58 ఏళ్ల మంగి నాగేశ్వరమ్మ కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు పయనమైంది. మంగళవారం అన్నమయ్య కాలిబాట మార్గాన పాదయాత్ర సాగింది. అంతా కొండమార్గం కావడంతో నాగేశ్వరమ్మ కొండ ఎక్కలేక హైబీపీతో గుర్రపుపాదం సమీపంలో సొమ్మసిల్లి పడిపోయింది. నాగేశ్వరమ్మకు సంబంధించిన ఇద్దరు మాత్రమే ఆమె వద్ద ఉన్నా.. వారు ఆమెను మోసుకెళ్లలేని స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో చాలా ముందు వెళుతున్న అర్షద్‌కు ఈ సమాచారం తెలియడంతో వెనక్కి వచ్చారు. ఆమెను వీపుపై ఎక్కించుకుని ఆరు కి.మీ దూరంలో ఉన్న రోడ్డు మార్గం వరకూ మోసుకెళ్లి, ప్రత్యేక వాహనంలో తిరుమలలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. -
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి కోవింద్
-
తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
-
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరితోపాటు రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు. రాష్ట్రపతి మంగళవారం మధ్యాహ్నం తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుంచి బయలుదేరి క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహస్వామివారి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి అహ్వానం పలికారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకస్వాములు వారికి స్వామివారి శేషవస్త్రం అందజేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఛైర్మన్, ఈవో కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని, 2021 క్యాలెండర్, డైరీని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా, డిఐజి క్రాంతిరాణా టాటా తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు రాష్ట్రపతి కోవింద్ దంపతులు రోడ్డుమార్గంలో తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘన స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం రాష్ట్రపతి దంపతులు 4.50 గంటలకు రేణిగుంట చేరుకుని, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు. -
రాష్ట్రపతి తిరుమల పర్యటన
-
రాష్ట్రపతికి సీఎం జగన్ ఘన స్వాగతం
సాక్షి, విజయవాడ : తిరుమల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ గోవింద్ మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుండి రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకుంటారు. అనంతరం 12.15 గంటలకు తిరుమల చేరుకుంటారు. శ్రీవారి దర్శనానంతరం 4.50 గంటలకు రేణిగుంట చేరుకుని, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
తిరుమల : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఉన్నారు. శ్రీలంక రాజధాని కొలంబొ నుంచి శ్రీవారి దర్శనార్ధం మోదీ ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. అక్కడ గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ప్రధానికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ముగ్గురూ అతిథిగృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత మోదీ, నరసింహన్, వైఎస్ జగన్ నేరుగా శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోగా ఆలయ అర్చకులు, ఆధికారులు స్వాగతం పలికారు. మొదటగా ధ్వజస్తంభానికి మొక్కుకుని బంగారు వాకిలి నుంచి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి వైభవం, ప్రాశస్త్యాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు మోదీకి వివరించారు. ఆలయ జీయర్లు శేషవస్త్రంతో సత్కరించారు. దర్శనానంతరం ప్రధాని, గవర్నర్, ఏపీ సీఎం వకుళామాతను, విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. హూండీలో కానుకలు సమర్పించిన ప్రధాని.. వెండివాకిలి నుంచి వెలుపలకి వచ్చారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ముగ్గురికీ వేద ఆశీర్వచనం చేశారు. ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మోదీ, వైఎస్ జగన్ ఆలయం వెలుపలకు రాగానే భక్తులు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. ప్రధాని, సీఎం వారికి అభివాదం చేస్తూ పద్మావతి అతిథిగృహానికి పయనమయ్యారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు. వీరితో పాటు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, ఆదిమూలం, బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టులో సీఎంకు ఘనస్వాగతం ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ రాక సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆదివారం అక్కడ ఘనస్వాగతం లభించింది. సా.3.55గంటలకు విమానంలో ఆయన ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, దుర్గాప్రసాద్, రెడ్డెప్ప, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, నవాబ్ బాష, ద్వారకానాథరెడ్డి, ఆదిమూలం, ఎంఎస్ బాబు, మేడా మల్లికార్జునరెడ్డి, పలువురు అధికారులు ఘన స్వాగతం పలికారు. -
శ్రీవారి ఆలయంలో తిరుప్పావై పారాయణం
ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం సాక్షి, తిరుమల: ధనుర్మాసం సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం వేకువజామున 3 గంటలకు తిరుప్పావై పారాయణం చేశారు. సూర్య సంక్రమణంతో సోమవారం ఉదయం 10.31 గంటల నుంచి ధనుర్మాసంగా పిలిచే మృగశిర మాసం ప్రారంభమైంది. ఈ నెలలో గోదాదేవి విరచిత 30 పాశురాల్లో రోజుకొకటి చొప్పున పారాయణం చేయనున్నారు. మంగళవారం నుంచే తిరుమల ఆలయంతోపాటు తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో కూడా తిరుప్పావై పారాయణం మొదలైంది. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో లఘుదర్శనం అమలు చేశారు. సర్వదర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నవారికి 5 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది.