
సాక్షి, తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ తొలిసారి తిరుమలకు వచ్చారు. గురువారం సాయంత్రం తిరుమలలో జస్టిస్ ఎన్వీ రమణకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన, ఈవో జవహర్‌రెడ్డి, ధర్మారెడ్డి స్వాగతం పలికారు. కాసేపట్లో శ్రీవారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు. ఆయన రాక సందర్భంగా తిరుమలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు.