( ఫైల్ ఫోటో )
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ పీఆర్‌ఓ విభాగం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. జూలై 1న శని త్రయోదశి, 3న ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూజ, గురుపూర్ణిమ, 13న సర్వఏకాదశి, 15న శని త్రయోదశి, 17న శ్రీవారి ఆణివార ఆస్థానం, 22న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర, శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేయడం, 30న నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం ఉంటాయని తెలిపింది.
కాగా, తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శనివారం అర్ధరాత్రి వరకు 83,889 మంది స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీల్లో రూ.3.10 కోట్లు సమర్పించుకున్నారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని భక్తులకు దర్శనానికి 24 గంటలు పడుతోంది.
తిరుమల శ్రీవారిని ఆదివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సాంబశివరావు నాయుడు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆయనకు ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. సినీ గాయని సునీత, ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment