![President RamNath Kovind Reaches Renigunta Airport - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/24/APCMYSJagan.jpg.webp?itok=YMr52WoJ)
సాక్షి, విజయవాడ : తిరుమల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ గోవింద్ మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుండి రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకుంటారు. అనంతరం 12.15 గంటలకు తిరుమల చేరుకుంటారు. శ్రీవారి దర్శనానంతరం 4.50 గంటలకు రేణిగుంట చేరుకుని, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు.
Comments
Please login to add a commentAdd a comment