
సాక్షి, తిరుమల: కలియుగ వైకుంఠదైవం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ దర్శనం లో అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యుడు శివకుమార్, అనకాపల్లి ఎంపీ సత్యవతి, తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, తెలంగాణ ఎమ్మెల్సీ లక్ష్మీరావు, తెలంగాణ ఐఎఎస్ శ్రీనివాసు రాజు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు.
టీటీడీ పాలకమండలి సభ్యుడు శివకుమార్ మాట్లాడుతూ.. గోవు అంతరించిపోకముందే వాటిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి మాట్లాడుతూ.. స్వామివారి కృపతో అపోలో ద్వారా మరింత సేవ చెయ్యాలని కోరుకుంటున్నా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment