న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) డిసెంబర్ క్వార్టర్లో 80% ఎగసింది. గతేడాది (2018–19) క్యూ3లో రూ.50 కోట్లుగా ఉన్న లాభం ఈ క్యూ3లో రూ.90 కోట్లకు పెరిగిందని అపోలో హాస్పిటల్స్‌తెలిపింది. అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరచడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపనీ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.2,495 కోట్ల నుంచి రూ.2,912 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.3.25 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment