తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స అందిస్తున్న అపోలో ఆసుపత్రిపై ఆమె అభిమానులు దాడి చేశారు. పోలీసులతో వాగ్వదం పెట్టుకున్న అమ్మ అభిమానులు, కార్యకర్తలు బారికేడ్లను తొలగించి ఆసుపత్రిలోకి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. ఆసుపత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కుర్చీలు విసిరేశారు.