తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వంను శాసనసభపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్ రోశయ్యను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు పన్నీరు సెల్వంను రోశయ్య ఆహ్వానించారు. తమ పార్టీ అధినేత్రి జయలలిత ఆదేశాల మేరకు పన్నీరు సెల్వంను నాయకుడిగా ఎన్నుకున్నామని అన్నాడీఎంకే నేతలు వెల్లడించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు జైలు శిక్షపడటంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో జయలలిత తనకు అత్యంత నమ్మకస్తుడైన పన్నీరు సెల్వంను తన వారసుడిగా ఎంపిక చేశారు. పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఇది రెండోసారి.
పన్నీరు సెల్వం జీవిత విశేషాలు:
1951లో జననం
1996లో రాజకీయాల్లో ప్రవేశం
2001 నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
2001లో సీఎంగా ప్రమాణం
ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు