
పన్నీరు సెల్వంకు రోశయ్య ఆహ్వానం
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు ఓ. పన్నీరు సెల్వంను గవర్నర్ కె. రోశయ్య ఆహ్వానించారు.
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు ఓ. పన్నీరు సెల్వంను గవర్నర్ కె. రోశయ్య ఆహ్వానించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అంతకుముందు పన్నీరు సెల్వంను శాసనసభపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ పార్టీ అధినేత్రి జయలలిత ఆదేశాల మేరకు ఆయనను నాయకుడిగా ఎన్నుకున్నామని అన్నాడీఎంకే నేతలు వెల్లడించారు.
ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు జయలలిత సీల్డ్ కవర్ లో పంపించినట్టు వార్తలు వచ్చాయి. పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఇది రెండోసారి. రేపు ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది.