
సాక్షి , చెన్నై: ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కిడ్నాప్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఓ వ్యక్తిని తిరుచ్చిరాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే...శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి 100కు ఫోన్‌చేసి సీఎం పళనిస్వామిని కిడ్నాప్ చేయబోతున్నట్లు 100 నంబర్‌కు ఫోన్ చేశాడు. చెన్నైలోని కంట్రోలు రూంకు వెళ్లిన ఆ ఫోన్ కాల్ వెళ్లగ...అక్కడి అధికారులు వెంటనే చెన్నై ఎగ్మూరు పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. తిరుచ్చిరాపల్లి నుంచి ఈ ఫోన్ వచ్చినట్లు గుర్తించి వెంటనే ఆగంతకుడిని పట్టుకోవాల్సిందిగా ఆ జిల్లా పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు. ఈ కేసులో తిరుచ్చిరాపల్లి శాస్త్రి రోడ్డులోని ఒక హోటల్‌లో పరోటా మాస్టర్‌గా పనిచేసే రహ్మతుల్లా (45) అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో తెలియకుండా ఫోన్ చేశానని రహ్మతుల్లా అంగీకరించాడు. శనివారం ఉదయం అతడిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టి తిరుచ్చిరాపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment