kidnopping
-
ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేస్తా!
సాక్షి , చెన్నై: ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కిడ్నాప్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఓ వ్యక్తిని తిరుచ్చిరాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే...శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి 100కు ఫోన్‌చేసి సీఎం పళనిస్వామిని కిడ్నాప్ చేయబోతున్నట్లు 100 నంబర్‌కు ఫోన్ చేశాడు. చెన్నైలోని కంట్రోలు రూంకు వెళ్లిన ఆ ఫోన్ కాల్ వెళ్లగ...అక్కడి అధికారులు వెంటనే చెన్నై ఎగ్మూరు పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. తిరుచ్చిరాపల్లి నుంచి ఈ ఫోన్ వచ్చినట్లు గుర్తించి వెంటనే ఆగంతకుడిని పట్టుకోవాల్సిందిగా ఆ జిల్లా పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు. ఈ కేసులో తిరుచ్చిరాపల్లి శాస్త్రి రోడ్డులోని ఒక హోటల్లో పరోటా మాస్టర్‌గా పనిచేసే రహ్మతుల్లా (45) అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో తెలియకుండా ఫోన్ చేశానని రహ్మతుల్లా అంగీకరించాడు. శనివారం ఉదయం అతడిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టి తిరుచ్చిరాపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. -
కన్న కొడుకునే కిడ్నాప్ చేసాడు
గుంటూరు : మద్యం తాగేందుకు డబ్బు కోసం కన్నకొడుకునే తండ్రి కిడ్నాప్ చేసిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పీఎస్ పరిధిలోని సిమెంటు ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన గోళ్ల శ్రీనివాసరావుకు తాడేపల్లికి చెందిన మహాలక్ష్మితో 2006లో వివాహమైంది. భార్యభర్తలిద్దరూ కూలి పనిచేసి జీవిస్తున్నారు. భార్య సందపాదన కుటుంబ పోషణకు ఖర్చు పెడుతుంటే భర్త తన సంపాదనను తాగుడుకు ఖర్చు చేస్తున్నాడు. విషయం పెద్దల దాకా వెళ్లి పంచాయితీలు పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. ఈలోగా వారికి ఓ కుమారుడు పుట్టాడు. ప్రతిసారి భార్య పంచాయితీ పెడుతోందన్న కోపంతో శ్రీనివాసరావు మహాలక్ష్మిని వదిలేసి, మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. తాగుబోతు మొగుడు పోతేపోయాడనుకుని మహాలక్ష్మి కుమారుడితో సహా పుట్టింటికి వచ్చి కూలి పని చేసుకుని జీవిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 7న ఓటేసేందుకు తాడేపల్లి వచ్చిన శ్రీనివాసరావు మహాలక్ష్మి ఇంటికి వచ్చి పిల్లోడితో ఆడుకుంటున్నట్లు నటించి చాకెట్లు కొనిపెడతానంటూ తీసుకుపోయాడు. ఎంతసేపటికీ వారిద్దరూ రాకపోవటంతో అనుమానం వచ్చిన మహాలక్ష్మి అత్తంటికి వెళ్లి బిడ్డ కోసం ఆరా తీసింది. అయినా ఫలితం లేకపోవటంతో పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.