అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు ఊరట
అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఊరట లభించింది. ఈ కేసులో విచారణపై సస్పెన్షన్ను సుప్రీంకోర్టు జూన్ 16వ తేదీ వరకు పొడిగించింది. సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ సి.నాగప్పన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే. ఆమెకు ఉన్న బినామీ ఆస్తుల అసలు యజమానులు ఎవరన్న విషయం తేలేవరకు ఈ కేసులో విచారణ ముందుకు వెళ్లకూడదని ఈ ధర్మాసనం భావించింది.
ఈ కేసులో విచారణపై స్టేను వెకేట్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన డీఎంకే నాయకుడు కె.అన్బళగన్కు కూడా కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కాగా, తమిళనాడు విజిలెన్స్, ఏసీబీ శాఖ వారం రోజుల్లోగా జయలలిత పిటిషన్పై తమ సమాధానాన్ని తెలపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.