తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు స్వీకరించారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం తమిళనాడు సచివాలయంలో జయలలిత బాధ్యతలు చేపట్టారు.
శనివారం జయలలిత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు 28 మంత్రులు ప్రమాణం చేశారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు ఆర్థిక శాఖ కేటాయించారు.