జయకు నాలుగేళ్ల జైలు: లైవ్ అప్డేట్స్ | Jayalalithaa gets four-year prison term | Sakshi
Sakshi News home page

జయకు నాలుగేళ్ల జైలు: లైవ్ అప్డేట్స్

Published Sat, Sep 27 2014 5:07 PM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM

జయకు నాలుగేళ్ల జైలు: లైవ్ అప్డేట్స్

జయకు నాలుగేళ్ల జైలు: లైవ్ అప్డేట్స్

అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దోషిగా నిర్ధారిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఆమెకు ఏ శిక్ష విధించేదీ మాత్రం ఇంకా వెల్లడించలేదు. 18 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో ఆమె దోషిగా తేలడంతో.. ఆమె భవితవ్యం ఏమవుతుందోనని దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సామాన్య ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసు తాజా పరిణామాలు ఇవీ.

* ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పదవికి అనర్హురాలు కానున్న జయలలిత

* కోర్టు తీర్పు నేపథ్యంలో జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొంది

* నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు వంద కోట్ల జరిమానా

* జయతో పాటు శశికళ, ఇళవరసన్, సుధాకరన్ కు నాలుగేళ్ల జైలు

* జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.

* జయలలితపై అక్రమాస్తుల కేసులో నేరం రుజువైనట్లు న్యాయమూర్తి తెలిపారు.
* ఆమెకు ఏశిక్ష విధిస్తారోనన్న విషయమై తుది తీర్పు మధ్యాహ్నం తర్వాత రావచ్చు.
* కర్ణాటక- తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న బ్యారికేడ్లను విరగ్గొట్టేందుకు అన్నా డీఎంకే కార్యకర్తలు ప్రయత్నించారు. వారిపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు.
* కోర్టు ఆవరణలో ఆందోళన చేస్తున్న జయలలిత మద్దతుదారులపై లాఠీఛార్జి
* బెంగళూరు మినీ తమిళనాడుగా మారిపోయింది. భారీ సంఖ్యలో అన్నా డీఎంకే, డీఎంకే కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు.
* ఈ కేసులో నేరం రుజువైతే.... ఆమెకు ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
* 1996లో సుధాకరన్ పెళ్లికి రూ. 5 కోట్లు ఖర్చుపెట్టినట్లు ఆరోపణలు
* నేరం రుజువైతే ఆమె ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది
* ఇదే జరిగితే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఫలితాలపై కూడా ప్రభావం చూపొచ్చు.
* ఒకవేళ జయలలితకు శిక్షపడి, ఆమె పదవిని వదులుకోవాల్సి వస్తే.. ఆమె స్థానంలో తాత్కాలిక సీఎంగా తమిళనాడు మాజీ సీఎస్ షీలా బాలకృష్ణన్ను నియమించే అవకాశం
* ఆమె కాని పక్షంలో 'అమ్మ'కు అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వంకు కూడా అవకాశం.
* ఈ కేసు.. తనపై తమ ఆగర్భ ప్రత్యర్థి డీఎంకే పన్నిన రాజకీయ కుట్రగా అభివర్ణించిన జయ
* కోర్టు బయట భారీసంఖ్యలో గుమిగూడిన అన్నాడీఎంకే మద్దతుదారులు
* ఈ కేసులో జయలలితతో పాటు ఆమెకు అత్యంత సన్నిహతురాలైన శశికళా నటరాజన్, ఇళవరసి కూడా కేసులో నిందితులే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement