ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ అభినందనలు | Narendra Modi congratulates Jayalalithaa on taking oath | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ అభినందనలు

Published Sat, May 23 2015 8:12 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Narendra Modi congratulates Jayalalithaa on taking oath

తమిళనాడుకు ఐదోసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా పీఎంఓ ఐడీ ద్వారా.. ఆయన జయలలితకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆమెకు, ఆమె బృందానికి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలిపారు.

అవినీతి ఆరోపణలు రుజువై, జైలుశిక్ష పడటంతో ఎనిమిది నెలల క్రితం ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన జయలలిత.. కర్ణాటక హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా బయటపడి మళ్లీ పదవి చేపట్టారు. అప్పట్లో కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే కూడా జయలలితను మోదీ అభినందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement