
జయ ఆస్తుల కేసులో రేపే తీర్పు
సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే చీఫ్ జయలలితపై ఉన్న రూ. 66 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని ట్రయల్ కోర్టు శనివారం తీర్పువెలువరించనుంది. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటిగా పేరుగాంచిన అగ్రహారం సమీపంలో తాత్కాలిక న్యాయస్థానాన్ని నిర్మిస్తున్నారు. ఆ ప్రాంగణంలో న్యాయవాదులు మినహా మరెవరూ ప్రవేశించకుండా చూడాలని పోలీసులు నిర్ణయించారు. జయపై వెలువడుతున్న తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో 1.18 లక్షల మంది పోలీసులను బం దోబస్తుకు వినియోగిస్తున్నారు. శనివారం కనీ సం 20 వేల మంది అన్నాడీఎంకే కార్యకర్తలు బెంగళూరుకు వచ్చే అవకాశం ఉండటంతో శాం తిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు.