న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ముప్పుతిప్పలుపడుతున్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌కు పెద్ద ఊరట. ఆరేళ్లుగా సాగుతున్న ఆ కేసును సీబీఐ శుక్రవారం మూసేసింది. తగిన ఆధారాలు లభించనందునే ప్రాథమిక విచారణ(పీఈ)ను మూసేస్తున్నట్లు పేర్కొంది. పెద్ద మొత్తంలో అడ్వాన్సులను, ఖర్చులను ఆస్తులుగా భావించడం వల్ల డబుల్ అకౌంటింగ్ జరగడం, బహుమతులను కూడా లెక్కలోకి తీసుకోవడం, రుణాలనూ ఆస్తులుగా లెక్కించడం వల్ల.. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లుగా పొరబడినట్లు వివరించింది.