నేడు తమిళనాడు సీఎం రాజీనామా | today, tamilnadu CM may resign | Sakshi
Sakshi News home page

నేడు తమిళనాడు సీఎం రాజీనామా

Published Mon, May 11 2015 3:20 PM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

నేడు తమిళనాడు సీఎం రాజీనామా

నేడు తమిళనాడు సీఎం రాజీనామా

చెన్నై: అక్రమాస్తుల కేసులో నిర్దోషిగా బయటపడ్డ అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ సీఎం బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. జయలలిత ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా, ప్రస్తుత తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం రాజీనామా చేయనున్నారు. ఈ రోజే సెల్వం రాజీనామా చేయవచ్చని భావిస్తున్నారు. ఈ నెల 16న జయలలిత తమిళనాడు సీఎంగా ప్రమాణం చేయవచ్చని సమాచారం.

జయలలితకు ఈ రోజు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు. జయలలితపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఆమెతో పాటు ఉన్న మరో ముగ్గురిని కూడా కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు కూడా ఈ కేసులో పెద్ద ఊరట లభించినట్లయింది. దీంతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement