అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దోషిగా నిర్ధారిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలు ప్రారంభించారు. తమిళనాడు- కర్ణాకట సరిహద్దుల్లో ఉన్న బ్యారికేడ్లను విరగ్గొట్టారు. కోర్టు పరిసరాల్లో కూడా విషయం తెలియగానే ఒక్కసారిగా తీవ్ర ఆందోళనలు, నినాదాలు ప్రారంభించారు.
అక్కడ సుమారు పదివేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటుచేసినా కూడా పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాలేదు. ఇటు తమిళనాడులోను, మరోవైపు కర్ణాటకలోను కూడా అల్లర్లు మొదలైపోయాయి. పలుచోట్ల దిష్టిబొమ్మల దహనాలు, దుకాణాలపై దాడులు జరుగుతున్నాయి. దాంతో తమిళనాడులో మొత్తం దుకాణాలు మూసేశారు. కొద్ది సంఖ్యలో ఉన్న పోలీసులు.. అన్నాడీఎంకే మద్దతుదారులను ఏమాత్రం అదుపుచేయలేకపోతున్నారు.
మరోవైపు డీఎంకే మాత్రం ఈ విషయం తెలియగానే సంబరాలు జరుపుకొంటోంది. ఇంతకుముందు కూడా జయలలితపై ఆరోపణలు వచ్చినప్పుడే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్నా డీఎంకే ఘోర పరాజయం పాలైంది. ఈ సందర్భాన్ని తలుచుకుని.. ఈసారి తాము మళ్లీ అధికారంలోకి రావచ్చని డీఎంకే భావిస్తోంది.
'మండి'పడుతున్న అన్నాడీఎంకే కార్యకర్తలు
Published Sat, Sep 27 2014 1:36 PM | Last Updated on Thu, May 24 2018 12:05 PM
Advertisement