
జయ కేసులో ఏఆర్ రెహ్మాన్ వాంగ్మూలం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ను విచారించారు. ఈ కేసును విచారించిన బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం రెహ్మాన్తో పాటు మాండొలిన్ శ్రీనివాస్ తదితర ప్రముఖుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. జయకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు 100 కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. గత శనివారం తుది తీర్పు వెలువడింది. అంతకుముందు కేసు విచారణలో భాగంగా ప్రత్యేక న్యాయస్థానం జడ్జి జాన్ మైఖేల్.. పలువురు ప్రముఖులను విచారించారు.
జయలలిత మాజీ దత్త పుత్రుడు సుధకరన్ వివాహం సందర్భంగా రెహ్మాన్, శ్రీనివాస్ సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఇదే విషయాన్ని వారు కోర్టుకు తెలియజేశారు. తాము డబ్బులు తీసుకోకుండా ఉచితం ప్రదర్శన ఇచ్చామన, అయితే ఆహ్వానంతో పాటు వెండి, పట్టు వస్త్రాలను కానుకగా ఇచ్చారని తెలిపారు. మరో సంగీత దర్శకుడు అమరన్ మహాబలిపురం రోడ్డులో గల తన 22 ఎకరాల ఫామ్హౌస్ను జయ సన్నిహితురాలు శశికళకు అమ్మినట్టు కోర్టుకు చెప్పారు.