కోర్టుకు మాజీ మంత్రి | DMK DuraiMurugan to Court | Sakshi
Sakshi News home page

కోర్టుకు మాజీ మంత్రి

Published Thu, Apr 7 2016 1:29 AM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM

కోర్టుకు మాజీ మంత్రి - Sakshi

కోర్టుకు మాజీ మంత్రి

 వేలూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ మంత్రి డీఎంకే పార్టీ ముఖ్య కార్యదర్శి దురైమురుగన్ భార్యతో కలసి బుధవారం ఉదయం వేలూరు కోర్టులో హాజరయ్యారు. మాజీ మంత్రి దురైమురుగన్‌కు సొంతమైన చెన్నై, కాట్పాడిలోని ఇళ్లతోపాటు కళాశాల, కార్యాలయాల్లో 2011లో ఏసీబీ పోలీసులు తనిఖీలు చేపట్టారు.
 
  అదే విధంగా దురైమురుగన్ భార్య శాంతకుమారికి సొంతమైన ఆస్తులపై తనిఖీలు చేసి ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణ బుధవారం వేలూరు కోర్టులో జరిగింది. ఈ కేసు విచారణకు దురైమురుగన్, భార్య శాంతకుమారి హాజరయ్యారు.
 
 కేసును విచారించిన న్యాయమూర్తి దక్షణామూర్తి ఈనెల 11వ తేదీకి కేసును వాయిదా వేస్తున్నట్లు ఆ రోజున నేరుగా హాజరు కావాలని తీర్పునిచ్చారు. అనంతరం బయటకు వచ్చిన దురైమురుగన్ విలేకరులతో మాట్లాడేందుకు నిరాకరించి వెళ్లిపోయారు. దురైమురుగన్ భార్యతో పాటు కోర్టుకు రావడంతో ఆ ప్రాంతంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement