ఇక ఢిల్లీ కోర్టులో వీరభద్ర సింగ్ కేసు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్, ఆయన భార్య అక్రమాస్తుల కేసు పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఎలాంటి వివాదానికి తావు లేకుండా ఉండేందుకు ఈ పిటిషన్ను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసినట్లు తెలిపింది. ఇంతకంటే ప్రస్తుతం ఈ పిటిషన్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది.
ఆరు కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ను అదుపులోకి తీసుకుని విచారించేందుకు సీబీఐ ప్రయత్నించగా ఆయన హైకోర్టుకు వెళ్లి రక్షణ పొందారు. దీంతో సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లగా కేసు కింది కోర్టులో ఉన్న సమయంలో తాము మధ్యలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో ఈ కేసును ఇక ఢిల్లీ హైకోర్టు విచారించనుంది.