cm veerabhadra singh
-
రూ.5.6 కోట్ల వీరభద్రసింగ్ ఆస్తుల అటాచ్
న్యూఢిల్లీ: నగదు అక్రమ రవాణా కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుటుంబ సభ్యులకు చెందిన రూ.5.6 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తాము అటాచ్ చేసిన ఆస్తులు సీఎం కొడుకు విక్రమాదిత్య సింగ్, కూతురు అప్రజితా సింగ్, భార్య ప్రతిభా సింగ్ పేరిట ఉన్నాయని ఈడీ తెలిపింది. ఇందుకు సంబంధించి పీఎంఎల్ఏ చట్టం కింద ఉత్తర్వులు జారీచేశామని వెల్లడించింది. -
ఇక ఢిల్లీ కోర్టులో వీరభద్ర సింగ్ కేసు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్, ఆయన భార్య అక్రమాస్తుల కేసు పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఎలాంటి వివాదానికి తావు లేకుండా ఉండేందుకు ఈ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసినట్లు తెలిపింది. ఇంతకంటే ప్రస్తుతం ఈ పిటిషన్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది. ఆరు కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించేందుకు సీబీఐ ప్రయత్నించగా ఆయన హైకోర్టుకు వెళ్లి రక్షణ పొందారు. దీంతో సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లగా కేసు కింది కోర్టులో ఉన్న సమయంలో తాము మధ్యలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో ఈ కేసును ఇక ఢిల్లీ హైకోర్టు విచారించనుంది.