
న్యూఢిల్లీ: నగదు అక్రమ రవాణా కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుటుంబ సభ్యులకు చెందిన రూ.5.6 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తాము అటాచ్ చేసిన ఆస్తులు సీఎం కొడుకు విక్రమాదిత్య సింగ్, కూతురు అప్రజితా సింగ్, భార్య ప్రతిభా సింగ్ పేరిట ఉన్నాయని ఈడీ తెలిపింది. ఇందుకు సంబంధించి పీఎంఎల్‌ఏ చట్టం కింద ఉత్తర్వులు జారీచేశామని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment