Attach assets
-
‘కశ్మీర్ ఉగ్ర సాయం’పై ఎన్ఐఏ కన్ను
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్న వ్యక్తులు, సంస్థలకు చెందిన ఆస్తులను అటాచ్ చేసేందుకు భద్రతా సంస్థలు చర్యలు ప్రారంభించాయి.కశ్మీర్‌కు చెందిన వ్యాపారి జహూర్ అహద్ షా వతాలీకి చెందిన 10 స్థిరాస్తులతోపాటు హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత సలాహుద్దీన్‌కు ఇస్లామాబాద్‌లో ఉన్న నివాసం ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఆదాయ పన్ను శాఖ ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించి చర్యలు చేపట్టనున్నాయి. ఉగ్ర సంస్థలకు సాయం అందించారన్న కేసులో వతాలీ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. పాక్‌కు చెందిన ఐఎస్ఐ సూచనల మేరకు ఉగ్రవాద సంస్థలకు, భద్రతా బలగాలపై రాళ్లు రువ్వే వారికి ఆర్థిక సాయం అందజేస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలాహుద్దీన్ సహా, హురియత్ నేతలు, వ్యాపారవేత్తలైన 13 మందిని ఎన్ఐఏ ఇప్పటికే గుర్తించింది. వీరి ద్వారా కశ్మీర్లో ఉగ్రవాదుల చేరికలు, శిక్షణ, పేలుడు సామగ్రి, ఆయుధాలు సమకూర్చడం, అల్లర్లకు పాల్పడే వారికి ఆర్థిక సాయం అందించడం వంటివి జరుగుతున్నాయని ఎన్ఐఏ తేల్చింది. కశ్మీర్ యువతను భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రేరేపించడంలో ఈ 13 మంది కీలకంగా ఉన్నట్లు గుర్తించింది. -
‘ఎయిర్‌సెల్’ శివశంకరన్ ఆస్తులు అటాచ్
సాక్షి, చెన్నై: ‘ఎయిర్‌సెల్’ సంస్థ వ్యవస్థాపకుడు శివశంకరన్‌కు చెందిన చెన్నైలోని రూ.224 కోట్ల ఆస్తులను ఈడీ శనివారం అటాచ్ చేసింది. శివశంకరన్ కొంతకాలం క్రితం ఐడీబీఐ బ్యాంక్ నుంచి వ్యాపార నిమిత్తం రూ.600 కోట్ల అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని సొంత అప్పుల్ని తీర్చేందుకు వాడుకున్నాడు. వడ్డీ చెల్లించకపోవడంతో ఐడీబీఐ పలుమార్లు నోటీసులిచ్చింది. అసలు చెల్లించాలని ఒత్తిడి చేయగా శివశంకరన్ చేతులు ఎత్తేశాడు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఈడీ చెన్నైలో శివశంకరన్‌కు చెందిన రూ.224 కోట్ల విలువైన స్థిర, రూ.35 లక్షల చరాస్తులను అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
రూ.4,700 కోట్ల స్టెర్లింగ్ ఆస్తుల అటాచ్
న్యూఢిల్లీ: బ్యాంకులను రూ.5,000 కోట్ల మేరకు మోసగించిన కేసుకు సంబంధించి గుజరాత్ ఫార్మా కంపెనీ స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్‌నకు చెందిన రూ.4,700 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం అటాచ్ చేసింది. ఈ సంస్థ, దాని ప్రమోటర్లు నితిన్, చేతన్ సందేశారాలపై గత ఏడాది అక్టోబర్‌లో కేసు నమోదు చేసింది. సందేశారా సోదరులు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి వివిధ బ్యాంకుల నుండి సుమారు రూ.5,000 కోట్ల రుణాలను పొందారు. 4,000 ఎకరాల స్థలం, ఫ్యాక్టరీ, యంత్రాలు, కంపెనీలు, నిర్వాహకులకు చెందిన 200 బ్యాంక్ ఖాతాలను, రూ.6.67 కోట్ల విలువైన వాటాలను, లగ్జరీ కార్లు వంటి పలు స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. స్టెర్లింగ్ గ్రూపు చేసిన పలు విదేశీ లావాదేవీలపై దర్యాప్తు జరుపుతున్నామని, 50 విదేశీ బ్యాంకు ఖాతాలు, నైజీరియాలోని ఆయిల్ రిగ్స్, ఆయిల్ ఫీల్డ్స్‌లను సీజ్ చేసేందుకు విదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. -
పీఎన్బీ స్కామ్ ఆస్తుల అటాచ్‌కు అనుమతించండి
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రుణ మోసంతో సంబంధమున్న వ్యక్తుల, సంస్థల ఆస్తుల ను ఆటాచ్ చేయడానికి అవకాశమివ్వాలని నేషనల్ కంపెనీ లా అప్పిల్లేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ)ను ప్రభుత్వం కోరింది. ఈ స్కామ్‌కు సంబంధించి ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని ఎన్సీఎల్ఏటీకి కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. బకాయిల రికవరీ కోసం, మేనేజ్మెంట్ తొలగింపుకు సంబంధించిన అధికారాలను కూడా ఇవ్వాలని కోరుతూ సదరు మంత్రిత్వ వాఖ ఒక పిటిషన్‌ను దాఖలు చేసింది. జస్టిస్ ఎస్. జె. ముఖోపాధ్యాయ అధ్యక్షతన గల ఇద్దరు సభ్యులు గల ఎన్సీఎల్ఏటీ ధర్మాసనం ఈ పిటిషన్‌ను ఈ నెల 23న విచారించనున్నది. ఈ రుణ స్కామ్‌కు సంబంధించి ఉత్తర్వుల్లో భాగంగా దాదాపు 60 కంపెనీలు, వ్యక్తులు తమ తమ ఆస్తులను విక్రయించకుండా ఎన్సీఎల్టీ నిషేధం విధించింది. నీరవ్ మోదీ, మేహుల్ చోక్సి వంటి వ్యక్తులు, గీతాంజలి జెమ్స్, గిల్లి ఇండియా, నక్షత్ర బ్రాండ్లు, ఫైర్‌స్టార్ డైమండ్ వంటి కంపెనీలు, సోలార్ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్ వంటి భాగస్వామ్య సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. -
తొలిసారిగా మావో నేత ఆస్తుల అటాచ్మెంట్
న్యూఢిల్లీ: బిహార్‌లోఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఓ మావోయిస్టు కమాండర్‌కు చెందిన రూ.86 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మావోయిస్టు ఆస్తులను ఈడీ వంటి దర్యాప్తుసంస్థ అటాచ్ చేయడం దేశంలో ఇదే తొలిసారి. అవినీతి నిరోధక చట్టం కింద సందీప్ యాదవ్ అలియాస్ బడ్కా భయ్యా, అతని కుటుంబీకుల స్థిర, చరాస్తులను అటాచ్చేస్తూ ఈడీ ఆదేశాలిచ్చింది. యాదవ్ ప్రస్తుతం మావోయిస్టు బిహార్–జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ‘మధ్య జోన్’ ఇన్చార్జిగా ఉన్నాడు. బిహార్‌లోని 5 ప్లాట్లను, ఢిల్లీలో ఫ్లాటు కొనుగోలుకు సంబంధించిన రూ.10.43 లక్షల నగదు, కొన్ని వాహనాలు, బ్యాంకు డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది. -
రూ.5.6 కోట్ల వీరభద్రసింగ్ ఆస్తుల అటాచ్
న్యూఢిల్లీ: నగదు అక్రమ రవాణా కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుటుంబ సభ్యులకు చెందిన రూ.5.6 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తాము అటాచ్ చేసిన ఆస్తులు సీఎం కొడుకు విక్రమాదిత్య సింగ్, కూతురు అప్రజితా సింగ్, భార్య ప్రతిభా సింగ్ పేరిట ఉన్నాయని ఈడీ తెలిపింది. ఇందుకు సంబంధించి పీఎంఎల్ఏ చట్టం కింద ఉత్తర్వులు జారీచేశామని వెల్లడించింది. -
లాలూ కుటుంబంపై ఐటీ కొరడా
బినామీ చట్టం కింద రూ.180 కోట్ల ఆస్తుల అటాచ్మెంట్ న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరుగురు కుటుంబ సభ్యులపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ కొరడా ఝుళిపించింది. రూ.1,000 కోట్ల భూముల క్రయవిక్రయాలకు సంబంధించి పన్ను ఎగవేతపై బినామీ లావాదేవీల (నియంత్రణ) చట్టం కింద వారి ఆస్తులను అటాచ్ చేసింది. ఈ మేరకు లాలూ సతీమణి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, కుమార్తె మిసా భారతి, అల్లుడు శైలేశ్‌కుమార్, కుమారుడు, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్, కుమార్తెలు చందా, రాగిణియాదవ్లకు ఐటీ నోటీసులు జారీ చేసింది. బినామీ లావాదేవీల చట్టం–2016 సెక్షన్ 24(3) కింద ఈ నోటీసులిచ్చింది. బినామీ ఆస్తుల వల్ల లాలూ వారసులు ప్రయోజనం పొందారన్న అభియోగంపై ఈ చర్యలు తీసుకుంది. ఐటీ శాఖ అటాచ్ చేసిన వాటిల్లో ఢిల్లీ, బిహారుల్లోని రూ.9.32 కోట్ల విలువైన డజను ఖాళీ స్థలాలు, భవంతులు ఉన్నాయి. వీటిల్లో ఢిల్లీ న్యూఫ్రెండ్స్ కాలనీలోని నివాస భవనం, పట్నా పుల్వారీ షరీఫ్ ప్రాంతంలోని 9 ప్లాట్లు, ఫామ్‌హౌస్ ఉన్నాయి. ఈ ఆస్తుల మార్కెట్ విలువ రూ.170–180 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. ప్రభుత్వ అనుమతితో అటాచ్ చేసిన ఆస్తులను జప్తు చేసుకొనేందుకు ఐటీ శాఖ సమాయత్తమవుతోంది. ఈ చట్టం కింద నేరం రుజువైతే ఏడేళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష, ఆస్తుల మార్కెట్ విలువలో 25 శాతం జరిమానా విధించే అవకాశం ఉంది. గత నెలలో లాలూ బినామీ ఆస్తులపై ఐటీ దేశవ్యాప్తంగా సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సోదాలు తనను భయపెట్టలేవని, తన వాగ్ధాటిని ఎదుర్కొనే దమ్ము లేకే బీజేపీ ఇలాంటి దాడులకు పాల్పడుతుందని నాడు లాలూ వ్యాఖ్యానించారు. అయితే ఇవన్నీ నిరాధార ఆరోపణలని, రాజకీయ కుట్రలో భాగంగానే ఇలాంటివి తెరపైకి వస్తున్నాయని తేజస్వీ పట్నాలో వ్యాఖ్యానించారు. కాగా, గత మే 23 నాటికి దేశ వ్యాప్తంగా 400 బినామీ కేసులను ఐటీ శాఖ గుర్తించింది. వీటిల్లో 240 కేసులకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసింది. వీటి మార్కెట్ విలువ రూ.600 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.