‘ఎయిర్‌సెల్‌’ శివశంకరన్‌ ఆస్తులు అటాచ్‌ | ED attaches assets of firms linked to Aircel promoter C Sivasankaran | Sakshi

‘ఎయిర్‌సెల్‌’ శివశంకరన్‌ ఆస్తులు అటాచ్‌

Published Sun, Feb 3 2019 4:57 AM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM

ED attaches assets of firms linked to Aircel promoter C Sivasankaran - Sakshi

ఎయిర్‌సెల్‌ శివశంకరన్‌

సాక్షి, చెన్నై: ‘ఎయిర్‌సెల్‌’ సంస్థ వ్యవస్థాపకుడు శివశంకరన్‌కు చెందిన చెన్నైలోని రూ.224 కోట్ల ఆస్తులను ఈడీ శనివారం అటాచ్‌ చేసింది. శివశంకరన్‌ కొంతకాలం క్రితం ఐడీబీఐ బ్యాంక్‌ నుంచి వ్యాపార నిమిత్తం రూ.600 కోట్ల అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని సొంత అప్పుల్ని తీర్చేందుకు వాడుకున్నాడు. వడ్డీ చెల్లించకపోవడంతో ఐడీబీఐ పలుమార్లు నోటీసులిచ్చింది. అసలు చెల్లించాలని ఒత్తిడి చేయగా శివశంకరన్‌ చేతులు ఎత్తేశాడు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఈడీ చెన్నైలో శివశంకరన్‌కు చెందిన రూ.224 కోట్ల విలువైన స్థిర, రూ.35 లక్షల చరాస్తులను అటాచ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement