మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది. ఈ కేసులో చిదంబరం కస్టడీ విచారణకు అనుమతించాలని బుధవారం ఢిల్లీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఎదుట ఈడీ తన స్పందనను తెలియచేస్తూ ఆయనకు బెయిల్ ఇవ్వరాదని కోరింది.
చిదంబరం తప్పించుకు తిరుగుతూ విచారణకు సహకరించడం లేదని కోర్టుకు నివేదించింది. కాగా, చిదంబరం బెయిల్ పిటిషన్‌పై గురువారం ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ ఎదుట వాదనలు కొనసాగనున్నాయి. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో అక్టోబర్ 8న చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలను నవంబర్ 1 వరకూ అరెస్ట్ చేయరాదని ఇచ్చిన ఉత్తర్వులు ముగియడంతో కోర్టు తదుపరి ఉత్తర్వులపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment