అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్ర జయలలితకు మద్దతుగా తమిళ సినీ పరిశ్రమ భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. తమిళ నటులు, దర్శకులు, నిర్మాతల దగ్గర్నుంచి ప్రదర్శకుల వరకు అనేక మంది వీటికి హాజరయ్యారు. అయితే.. ఇందులో మరో కొత్త ట్విస్టు కనిపించింది. అగ్రనటులు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్.. ఇలాంటి వాళ్లు మాత్రం ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. వీళ్లలో కమల్హాసన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో రాలేకపోయారు. మిగిలినవాళ్లు ఎందుకు రాలేదన్న విషయం మాత్రం ఇప్పటికీ సస్పెన్సుగానే ఉంది.
జయలలితకు మద్దతుగా జరిగిన నిరసన కారణంగా రాంచరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే సినిమా మాత్రం తమిళనాడులో విడుదల కాలేదు. ఆంధ్రప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో బుధవారమే విడుదలైన ఈ సినిమా.. తమిళనాడులో ఉన్న ప్రేక్షకులకు మాత్రం శుక్రవారం వరకు అందుబాటులోకి రాదు.
అమ్మ నిరసనలకు కమల్, రజనీ డుమ్మా!
Published Wed, Oct 1 2014 3:01 PM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM
Advertisement
Advertisement