జయ కేసు సాగిందిలా..
చెన్నై: అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు హైకోర్టు తీర్పుతో ఉపశమనం లభించిన సంగతి తెలిసిందే.
జయపై నమోదైన అభియోగాలన్నింటినీ కర్ణాటక హైకోర్టు కొట్టివేసి ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. హైకోర్టు తీర్పుతో దేశ వ్యాప్తంగా ఆసక్తికరమైన పరిస్థితులు చోటు చేసుకున్నా.. సుదీర్ఘ కాలం పాటు జరిగిన జయలలిత అక్రమ ఆస్తుల కేసును ఒకసారి పరిశీలిద్దాం.
* 1991 నుంచి 1996 జయలలిత సీఎంగా ఉన్న సమయంలో అక్రమ ఆస్తులను కూడబెట్టిందంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పెషల్ కోర్టులో కేసు ఫైల్
* రూ.66 కోట్లకు పైగా కూడబెట్టిందంటూ నమోదైన ఆ కేసులో డిసెంబర్ 7, 1996న జయ అరెస్ట్
* జయతో పాటు మరో ముగ్గురిపై నమోదైన ఆస్తుల కేసులో 1997 లో సెషన్స్ కోర్టులో కేసు విచారణ
*1997 జూన్ 4న 120-బి ఐపీసీ, 13(2), 13(1) సెక్షన్ల కింద చార్జిషీట్ నమోదుకు కోర్టు ఆదేశం
*1997లో జయలలిత దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించిన మద్రాస్ హైకోర్టు
* ఇదే కేసులో అప్పటి గవర్నర్ ఫాతిమా బీవీపై విచారణకు హైకోర్టు ఆదేశం
*2000 సంవత్సరం, ఆగస్టులో 250 సాక్షుల విచారణ
*2000 సంవత్సరం ,అక్టోబర్ లో తమిళనాడు చిన్నతరహా పరిశ్రమల శాఖలో అవినీతికి పాల్పడినట్లు జయలలితపై అభియోగాలు
* ఆ కేసులో నమోదైన అభియోగాలను రద్దు చేసిన సుప్రీంకోర్టు
* 2001లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు.. అన్నా డీఎంకేకు పూర్తి మెజారిటీ
* జయపై అభియోగాలు ఉండటంతో అంతకుముందు ఎన్నికలకు దూరంగా ఉన్న ఆమె.. ఆ తరువాత ఉప ఎన్నికల్లో గెలిచి 2002 ఫిబ్రవరి 21న ప్రమాణ స్వీకారం
* 2003 లో డీఎంకే జనరల్ సెక్రటరీ కె అన్ బాంజ్ గాన్ ఆ కేసు విచారణను తమిళనాడు నుంచి కర్ణాటకు బదిలీ చేయాలని పిటిషన్
* జయలలిత సీఎంగా ఉండటంతో ఆ కేసు పక్కదోవ పడుతుందని పిటిషన్ లో ఆరోపణ
* అందుకు సుప్రీం అంగీకారం తెలపడంతో కేసు విచారణ కర్ణాటకకు బదిలీ
* 2014 సెప్టెంబర్ 27న అక్రమాస్తుల కేసులో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసిలను దోషులుగా తేల్చిన స్పెషల్ కోర్టు. నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల జరిమానా విధింపు
* 2014 సెప్టెంబర్ 29న తీర్పును సవాలుచేస్తూ, బెయిల్ కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన జయలలిత
* 2014 అక్టోబర్ 7: బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు, బెయిల్ ఇవ్వడానికి కారణాలు లేవని స్పష్టీకరణ
* 2014 అక్టోబర్ 9: బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన జయలలిత
* 2014 అక్టోబర్ 17: జయలలితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
* 2015 మే 11: అక్రమాస్తుల కేసులో జయలలిత, మరో ముగ్గురు నిర్దోషులంటూ కర్ణాటక హైకోర్టు ప్రకటన