
జయలలిత ఆస్తుల కేసులో తీర్పు 27న
బెంగళూర్:తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసును ఈ నెల 27 వాయిదా వేస్తూ ఇక్కడి ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. వాస్తవానికి ఈ కేసులోని తీర్పును ఈ నెల 20 వ తేదీనే వెలువరించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా తీర్పును వెలువరించే ప్రాంతాన్ని మార్చాలని జయలలిత కోర్టును కోరడంతో మరో వారం రోజుల పాటు వాయిదా వేయక తప్పలేదు. ఈ తీర్పుపై ప్రాంతాన్ని మార్చాలని కోరతూ సోమవారం జయలలిత కోర్టును ఆశ్రయించారు.
దీంతో ఈ కేసులో తీర్పును పరపన్నా అగ్రహారా సెంట్రల్ జైల్ ప్రాంతంలో గాంధీ భవన్ వద్ద వెలువరించనున్నట్లు జడ్జి జాన్ మైఖేల్ కున్హా తెలిపారు. అక్కడ జయలలిత భారీ భద్రత ఏర్పాట్లు చేయడానికి చెన్నై పోలీసులు సిద్ధమైయ్యారు.