
తాజ్‌కృష్ణాలో జీవిత సందడి
సాక్షి,హైదరాబాద్: ఆభరణాలు ధరించినవారికి రిచ్‌లుక్ తెస్తాయి. కొన్ని మాత్రం దానికి రాయల్ లుక్‌ని కూడా జోడిస్తాయి. అలాంటి రాజసాన్ని ఒలికించే ప్రత్యేకమైన ఆభరణాల ప్రదర్శన బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో శుక్రవారం ఏర్పాౖటెంది. ఈ ప్రదర్శనను సినీ ప్రముఖురాలు జీవిత సహా పలువురు నగర ప్రముఖులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహక సంస్థ జైపూర్ జ్యుయల్స్ ప్రతినిధి, డిజైనర్ అపర్ణా సుంకు మాట్లాడుతూ రాజుల కాలం నాటి ఆభరణ శైలుల నుంచి స్ఫూర్తి పొంది వాటికి ఆధునికతను జోడించి అద్భుతంగా తీర్చిదిద్దిన ఆభరణాలను తాము ప్రదర్శిస్తున్నామని తెలిపారు. ప్రదర్శన 3 రోజల పాటు కొనసాగుతుందన్నారు.