
రాష్ట్రపతిని కలిసిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరు భేటీ అయ్యారు. ‘రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో రాష్ట్రపతి భవన్‌లో సమావేశం అయ్యాను. చాలా ఆనందంగా ఉంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. గతేడాది డిసెంబర్‌లో సోనియా నుంచి అధ్యక్ష బాధ్యతలు అందుకున్న అనంతరం గౌరవసూచకంగానే రాష్ట్రపతిని రాహుల్ కలిశారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.