
సాక్షి,న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఢీ కొట్టి విజయం సాధించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న కాంగ్రెస్ ఇందుకు సరికొత్త ఆయుధాలనూ సిద్ధం చేస్తున్నది. రాహుల్‌కు పార్టీ పగ్గాలు అప్పగించి 2019 ఎన్నికల్లో యువనేతే తమ బాహుబలంటూ సంకేతాలు పంపుతున్న కాంగ్రెస్ తాజాగా మోదీ హవాకు చెక్ పెట్టే వ్యూహాలకు పదును పెడుతున్నది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సోషల్ మీడియాపై బీజేపీ ఫోకస్ పెట్టడం కలిసిరావడంతో రానున్న ఎన్నికలకు డిజిటల్ మార్గాన్ని ఎంచుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ విజయానికి సాయపడ్డ బిగ్‌డేటా సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికాను ఆశ్రయించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు ఆ సంస్థతో రాహుల్ బృందం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. ఈ సంస్థ ఆన్‌లైన్ సెర్చి ఇంజన్లు, షాపింగ్ వెబ్‌సైట్లు, ఈమెయిల్స్‌లో వినియోగదారులు ఎంచుకున్న ఛాయిస్‌ల ఆధారంగా వారి అభిరుచులను విశ్లేషించి అవసరమైన సమాచారాన్ని ఆయా క్లయింట్లకు చేరవేస్తుంది.
‘బిగ్’ ఐడియా
బిగ్ డేటా అనలిటిక్స్ ద్వారా ఆయా సంస్థలు ఇచ్చే విశ్లేషణల ఆధారంగా భిన్న ఓటర్ల గ్రూపులను గుర్తించి వారికి నిర్థిష్ట మెసేజ్‌లను చేరవేయడం ద్వారా రాజకీయ పార్టీలు లాభపడతాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన ఈ వ్యూహం ఫలించడంతో తాజాగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో డిజిటల్ వ్యూహాలకు పెద్దపీట వేయాలని రాహుల్ బృందం నిర్ణయించింది. దీంతో కేంబ్రిడ్జ్ అనలిటికా సహకారం తీసుకుని మోదీపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాలని రాహుల్ బృందం భావిస్తోంది.
ట్రంప్‌కు పట్టం..మరి రాహుల్‌కు..?
మరోవైపు రానున్న లోక్‌సభ ఎన్నికలకు యూపీఏ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కేంబ్రిడ్జ్ అనలిటికా సీఈవో అలెగ్జాండర్ నిక్స్ ఇప్పటికే పలు ప్రతిపక్ష నేతలను కలుసుకున్నట్టు సమాచారం. ఓటర్లను ఆన్‌లైన్‌లో టార్గెట్ చేసే వ్యూహంపై ఈ కంపెనీ కాంగ్రెస్‌కు సవివర ప్రెజెంటేషన్ ఇచ్చింది. ట్రంప్ విక్టరీ అటు తర్వాత బ్రెగ్జిట్ ఓటింగ్‌పై ప్రభావం చూపిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు కేంబ్రిడ్జ్ ఎనలిటికాను సంప్రదిస్తున్నారు. ఇక ఈ సంస్థ సహకారంతో మోదీపై రాహుల్ పైచేయి సాధిస్తారా..? రాహుల్ డేటా బ్రహ్మాస్త్రం ఫలిస్తుందా అనేది వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment